ప్రో కబడ్డి లీగ్  సీజన్ 7 లో బెంగళూరు బుల్స్ మరో అద్భుత విజయాన్ని అందుకుంది.  యూ ముంబై తో చివరివరకు హోరాహోరీగా పోరాడిన బుల్స్ కేవలం 2 పాయింట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.  స్టార్ రైడర్ పవన్ కుమార్ 11 పాయింట్లతో అదరగొట్టి బెంగళూరు విజయంలో కీలకంగా వ్యవహరించాడు.  అయితే యూ ముంబా ఆటగాడు అభిషేక్ 10 పాయింట్లతో చివరి వరకు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. 

జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికన జరిగిన ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. అయితే స్వల్ప తేడాతో ముంబై ఓటమిని చవిచూసింది. బెంగళూరు జట్టు రైడింగ్ లో 19, ట్యాకిల్స్ లో 10, ఆలౌట్ల ద్వారా 4, ఎక్స్‌ట్రాల రూపంలో 2 ఇలా మొత్తం 35 పాయింట్లు సాధించింది. అయితే ముంబై  మాత్రం రైడింగ్  లో 23, ట్యాకిల్స్ లో 7, ఆలౌట్ల ద్వారా 2, ఎక్స్‌ట్రాల రూపంలో 1 మొత్తం 33 పాయింట్లు సాధించింది. ఇలా కేవలం 2 పాయింట్ల తేడాతో ముంబై ఓటమిని చవిచూసింది.

బెంగళూరు ఆటగాళ్ళలో పవన్ కుమార్ 11, బంటి 6, సౌరభ్ 5, సుమిత్ 3, అమిత్ 3 పాయింట్లు సాధించారు. అలాగే ముంబై ఆటగాళ్లలో అభిషేక్ 10, అతుల్ 9, సందీప్ 4, సురీందర్ 3, రోహిత్ 2, ఫజల్ 2 పాయింట్లు సాధించారు.