CWG 2022: మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నై.. సెక్స్ చేసేప్పుడు జాగ్రత్త : అథ్లెట్లను హెచ్చరించిన నిర్వాహకులు

Commonwealth Games 2022: బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడలలో పాల్గొంటున్న అథ్లెట్లకు నిర్వాహకులు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.  సెక్స్ చేసేప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 

practise safe sex, to prevent possible spread of STIs and Monkey pox: CWG Organisers Warn Athletes

గడిచిన రెండ్రోజులుగా యూకేలోని వెస్ట్ మిడ్‌లాండ్‌లో గల బర్మింగ్‌హామ్ లో  సందడి వాతావరణం నెలకొంది. ‘కామన్వెల్త్’ కోసం నగరం సర్వాంగ సుందరంగ ముస్తాబైంది. 72 దేశాల నుంచి అథ్లెట్లు,  వివిధ దేశాల అభిమానులు, వాణిజ్య, వ్యాపార, క్రీడా సమావేశాలతో  బర్మింగ్‌హామ్ లో ఎటు చూసినా పండుగ వాతావరణమే కనిపిస్తున్నది. అయితే ఈ క్రీడలలో పాల్గొంటున్న అథ్లెట్లకు  కామన్వెల్త్ నిర్వాహకులు పలు కీలక సూచనలు చేశారు. బర్మింగ్‌హామ్ తో పాటు యూకే వేదికగా మంకీ పాక్స్ కేసులు  పెరుగుతున్న  నేపథ్యంలో సెక్స్ చేసేప్పుడు జాగ్రత్తగా ఉండాలని.. ఏమాత్రం అనుమానం వచ్చినా, లక్షణాలు కనిపించినా వైద్యాధికారులను సంప్రదించాలని  సూచిస్తున్నారు. 

కామన్వెల్త్ క్రీడలు ఆడేందుకు 72 దేశాల నుంచి సుమారు 6వేలకు పైగా అథ్లెట్లు బర్మింగ్‌హామ్ లో ఉన్నారు.  ఇంత భారీ ఈవెంట్ లో  పార్టీలకు కొదవేం లేదు. దీంతోపాటే అథ్లెట్లు శృంగార అవసరాల కోసం బయటకు వెళ్తే సురక్షితమైన విధానంలో సెక్స్ చేయాలని  నిర్వాహకులు సూచిస్తున్నారు. యూకేలో ఇప్పటికే 2,200 మందికి పైగా మంకీ పాక్స్ కేసులున్నాయి. దీంతో అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు. 

ఇదే విషయమై యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ ((UKHSA) అథ్లెట్లకు కీలక  సూచనలు జారీ చేసింది. ‘ఇంత భారీ ఈవెంట్ లో పార్టీ తరహా వాతావరణం సర్వసాధారణమే. చాలా మంది  బర్మింగ్‌హామ్ ను సందర్శిస్తున్నారు. ఈ క్రమంలో సురక్షిత శృంగారంలో పాల్గొనండి. కండోమ్స్ ను కచ్చితంగా వాడండి. తద్వారా సుఖ వ్యాధులు (ఎస్టీఐ)ల నుంచి దూరంగా  ఉండండి. అసలే దేశంలో మంకీ పాక్స్ కేసులు పెరుగుతున్నాయి.  ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాలేం కనిపించినా వెంటనే మాకు రిపోర్ట్ చేయండి.. ’ అని తెలిపింది. 

మంకీపాక్స్ అనేది సుఖవ్యాధి కాదు.  సెక్స్ చేయడం ద్వారా ఇది సోకే అవకాశం లేదు. కానీ ఒక వ్యక్తితో క్లోజ్ గా కాంటాక్ట్ లో ఉంటే  వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో  ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నది యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ.  కండోమ్ ను తప్పనిసరిగా వాడాలని లేనిపక్షంలో సుఖవ్యాధులకు సంబంధించిన పరీక్షలనైనా చేసుకోండని హితబోధ చేస్తున్నది. 

ఆటల సందర్భంగా అథ్లెట్లు అరక్షిత శృంగారం  జోలికి వెళ్లకూడటమే మంచిదని యూకేహెచ్ఎస్ఏ సూచించింది. ముఖ్యంగా గే, బై సెక్సువల్, కీర్ మెన్ (పురుషులతో పురుషులు చేసే శృంగారం) వంటివాళ్లు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. 

 

లక్షా యాభై వేల కండోమ్ ల పంపిణీ : 

రెండు వారాల ఆటల కోసం కామన్వెల్త్ నిర్వాహకులు 6 వేల అథ్లెట్లకు 1,50,000 కండోమ్స్ ను అందుబాటులో ఉంచారట. అంటే.. ఒక్కో అథ్లెట్ కు 23 కండోమ్స్ అన్నమాట. ఇది గతేడాది టోక్యో ఒలింపిక్స్ లో అందజేసిన కండోమ్స్ సంఖ్య కంటే 10వేలు ఎక్కువ. అయితే వీటిని అథ్లెట్లకు అందజేస్తున్న నిర్వాహకులు.. ఫ్రీ కండోమ్స్ ను వాడొద్దని.. వాటిని ఇంటికి తీసుకెళ్లి హెచ్ఐవీ మీద అవగాహన కల్పించాలని ఆదేశిస్తున్నది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios