భారత స్టార్ షట్లర్, వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధు.. మంగళవారం ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. ప్రపంచ ఛాంపియన్ షిప్ గెలిచిన  తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన ఆమె తన ఆనందాన్ని ప్రధాని మోదీతో పంచుకున్నారు. ఈ సందర్భంగా పీవీ సింధుని ప్రధాని మోదీ అభినందించారు.

తాను గెలిచిన బంగారు పతకాన్ని సింధు... మోదీ చేతులకు అందజేసింది. కాగా దానిని స్వయంగా మోదీ... సింధు మెడలో వేశారు. ఆమె ప్రధానిని కలిసిన సమయంలో కేంద్ర క్రీడాశాఖ మత్రి కిరణ్ రిజిజు, సీనియర్ కోచ్ గోపీచంద్, సింధు కోచ్ కిమ్ జి హ్యూన్ కూడా ఉన్నారు.  కాగా ఈ సందర్భంగా పీవీ సింధుకి కేంద్ర క్రీడా శాఖ రూ.10లక్షల నజరానా ప్రకటించింది.

క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు... ఈ చెక్కును సింధు చేతికి అందజేశారు. స్విట్జర్లాండ్ లోని బోసెల్ లో ఆదివారం జరిగిన ఫైనల్ వార్ లో సింధు విజయం సాధించిన సంగతి తెలిసిందే. పదునైన స్మాష్ లు, డ్రాప్ షాట్లతో విరుచుకుపడుతూ తన ప్రత్యర్థి ఒకురను ఉక్కిరిబిక్కిరి చేసింది. దాదాపు 38 నిమిషాలపాటు సాగిన ఈ మ్యాచ్ లో సింధు వరస గేమల్లో 21-7, 21-7 తో విజయభేరి మోగించింది. వరల్డ్ ఛాంపియన్ షిప్ లో సింధు ఇప్పటి వరకు ఐదు పతకాలు గెలుచుకుంది.