బీడబ్యూఎఫ్ కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ 500 టోర్నమెంట్ లో భారత షట్లర్ పారుపల్లి కశ్యప్ విజయయాత్ర కొనసాగులతోంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో వరుసగా మూడు విజయాలను అందుకున్న అతడు సెమీఫైనల్లోకి అడుగుపెట్టాడు.  శుక్రవారం జరిగిన క్వార్టర్స్ లో డైన్మార్క్ క్రీడాకారుడు  జార్గెన్‌సన్ ను 24-22,21-8 వరుస సెట్లలో ఓడించి కశ్యప్ సైమీస్ లోకి దూసుకుపోయాడు. 

ఈ కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ ఆరంభంలోనే భారత బృందానికి ఎదురుదెబ్బ తగిలింది. మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ షట్లర్లరిద్దరూ నిరాశపర్చారు.  భారీ అంచనాలతో బరిలోకి దిగిన పివి సింధు, సైనా నెహ్వాల్ లు తొలి రౌండ్ నుండే వెనుదిరిగారు. ఇలా వారు అభిమానులను తీవ్రంగా నిరాశపర్చినా కశ్యప్ ఒక్కడే వారిని అలరిస్తున్నాడు. 

అయితే ఇచియాన్ వేదికన జరుగుతున్న ఈ టోర్నీలో ఇప్పటివరకు కశ్యప్ జర్నీ సాఫీగా సాగింది. కానీ సెమీఫైనల్లో అతడికి అసలు సిసలైన సవాల్ ఎదురుకానుంది. జపాన్ కు చెందిన వరల్డ్ నెంబర్ వన్ షట్లర్ కెంటో మొమాట తో కశ్యప్ సెమీస్ లో తలపడనున్నాడు. ఈ మ్యాచ్ లో కశ్యప్ విజేతగా నిలిస్తే భారత్ కు ఓ పతకం ఖాయం కానుంది. 

ఈ టోర్నీలో ఆరంభంలో కశ్యప్‌ చైనీస్‌ తైపీ షట్లర్  లూ-ఛియా-హంగ్‌ పై గెలుపొందాడు.  21-16,21-16 వరుస సెట్లలో పైచేయి సాధించి  సునాయాసంగా విజయాన్ని అందుకున్నాడు.  ఆ తర్వాత  రెండో రౌండ్లో మలేషియా షట్లర్ లూయీ డారెన్ పై కశ్యప్ 21-17,11-21,21-12  తేడాతో గెలపుపొందాడు. ఇలా క్వార్టర్స్ లో అడుగుపెట్టిన కశ్యప్ అందులోనూ విజయకేతనం ఎగరేసి సెమీఫైనల్లో అడుగుపెట్టాడు. 

సంబంధిత వార్తలు

 కొరియా ఓపెన్ లో కశ్యప్ దూకుడు... క్వార్టర్స్ కు అర్హత

కొరియా ఓపెన్... సింధు, సైనా ఇంటికి... కశ్యప్ ఒక్కడే..