టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్ అడ్డంగా బుక్కయ్యాడు. కీపర్ పార్థివ్ పటేల్ ని ట్రోల్ చేయబోయి.. తానే ట్రోలింగ్ గురయ్యాడు యువరాజ్. ఇంతకీ మ్యాటరేంటంటే.. యువరాజ్- పార్థివ్ పటేల్ లు అప్పుడప్పుడు సరదాగా.. ఒకరిపై మరకొరు సెటైర్లు వేసుకుంటూ ఉంటారు.  దాదాపు ఎక్కువ శాతం యువరాజ్ దే పై చేయిగా ఉండేది. తాజాగా మరోసారి యువరాజ్ సెటైర్ వేశాడు. కానీ అది రివర్స్ అయ్యి కూర్చొంది.

పార్థివ్.. జిమ్ లో వ్యాయామం పూర్తి చేసిన అనంతరం ట్రెడ్ మిల్ పై కూర్చున్న ఫోటోని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ఆ ఫోటోకి ‘‘ఈ రోజుకి అయిపోయింది’’ అనే క్యాప్షన్ ని జత చేశాడు.

ఆ ఫోటోకి యువరాజ్ స్పందించాడు. ‘‘ చూస్తుంటే బాగా అలసిపోయినట్లు ఉన్నావ్.. చెమటలు ధారాళంగా కారుతున్నాయ్’’ అని కామెంట్ చేశాడు. నిజానికి పార్థివ్ చెమటలు కక్కేంతగా శ్రమించలేదని ఫోటో చూస్తే అర్థమౌతోంది. దీంతో.. వెంటనే పార్థవ్.. యూవీకి సెటైర్ వేశాడు. ‘‘నా దగ్గరేమీ ఎడిటింగ్ టీం లేదు.. 15 నిమిషాలు చేసి 2 గంటల సెషన్ చేసినట్టు చూపించుకోవడానికి’’ అని యువీకి దిమ్మదిరిగే రిప్లై ఇచ్చాడు. వీరిద్దరి ట్రోలింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు సరదా కామెంట్లతో దీనికి మరింత రక్తి కట్టిస్తున్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Done for the day....

A post shared by parthiv patel (@parthiv9) on Feb 6, 2019 at 5:33am PST