పారాలింపిక్స్ 2020లో భారత్‌కి ఒకే రోజు రెండో పతకం... హై జంప్‌లో నిషద్ కుమార్‌కి రజతం...
మెన్స్ హై జంప్ టీ47 ఈవెంట్‌లో భారత అథ్లెట్ నిషద్ కుమార్ రజతం... 2.06 మీటర్లతో ఆసియా రికార్డు క్రియేట్ చేసిన భారత పారా అథ్లెట్... ఒకే రోజు భారత్‌కి రెండు పతకాలు...
పారాలింపిక్స్ 2020లో ఒకే రోజు రెండు పతకాలు సాధించింది భారత్. టీటీలో భవీనా పటేల్ రజతం సాధించగా... మెన్స్ హై జంప్ టీ47 ఈవెంట్‌లో భారత అథ్లెట్ నిషద్ కుమార్, రజతం సొంతం చేసుకున్నాడు. 2.06 మీటర్ల ఎత్తు జంప్‌తో నిషద్ కుమార్ రెండో స్థానంలో నిలవగా భారత్ నుంచి పోటీపడిన రామ్‌పాల్ ఐదో స్థానంలో నిలిచాడు...
నిషద్ కుమార్ హై జంప్ 2.06 మీటర్లు ఆసియా రికార్డు కూడా కావడం విశేషం. రజతం గెలిచిన నిషద్ కుమార్‌కి ప్రధాని మోదీ అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు...
అంతకుముందు టోక్యో పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్, టీటీ ప్లేయర్ భవీనా పటేల్ ఫైనల్‌లో పోరాడి ఓడి, రజతం గెలుచుకుంది. చైనాకి చెందిన వరల్డ్ నెం.1 పారా టీటీ ప్లేయర్ జియో యింగ్‌తో జరిగిన మ్యాచ్‌లో 0-3 తేడాతో వరుస సెట్లలో ఓడింది భవీనా. ఈ పారాలింపిక్స్‌లో భారత్‌కి ఇదే మొట్టమొదటి పతకం కాగా, టేబుల్ టెన్నిస్ చరిత్రలో టీమిండియాకి ఇదే తొలి పతకం....
పారాలింపిక్స్‌లో దీపా మాలిక్ తర్వాత పతకం సాధించిన రెండో భారత మహిళా అథ్లెట్‌గా రికార్డు క్రియేట్ చేసింది భవీనా పటేల్. 2016 రియో పారాలింపిక్స్‌లో షార్ట్ పుట్‌లో దీపా మాలిక్ రజతం సాధించింది.