ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ ప్రదర్శన పట్ల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్. సూపర్ 4లో భాగంగా రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అనంతరం ఆయన మాట్లాడుతూ.. భారత క్రికెటర్ల ప్రతిభ అపూర్వమని.. అయితే పాక్ ఇంకా టోర్నీ నుంచి నిష్క్రమించలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించాడు.

ధావన్, రోహిత్ బాగా ఆడారన వీరిద్దరి జోడిని విడదీయడానికి తాము ఎంతో శ్రమించాల్సి వచ్చిందన్నారు. బ్యాటింగ్‌లో మెరుగైనా.. ఫీల్డింగ్‌లో పాక్ పుంజుకోవాల్సింది ఎంతో ఉందన్నారు. రోహిత్ ఇచ్చిన క్యాచ్‌లు జరవిడవడం, ఫీల్డింగ్ లోపాలు పాక్‌ను బాగా దెబ్బ తీశాయని.. బంగ్లాదేశతో మ్యాచ్‌లో తమ సత్తా చూపిస్తామని సర్ఫరాజ్ ధీమా వ్యక్తం చేశాడు.