ఇండియన్ ఫాస్ట్ బౌలర్ అశోక్ దిండా తలకు తీవ్ర గాయమైంది. కోల్ కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఈ రోజు జరిగిన ఓ ప్రాక్టీస్ మ్యాచ్ లో అశోక్ దిండా బౌలింగ్ చేస్తుండగా.. బ్యాట్స్ మెన్ కొట్టిన బంతి నేరుగా వచ్చి అతని ముఖానికి తాకింది. దీంతో అశోక్ దిండా ఒక్కసారిగా నేలపై కుప్పకూలాడు. 

వెంటనే స్పందించిన టీం అతనిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అశోక్ దిండా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వీవీఎస్ లక్ష్మణ్ పర్యవేక్షణలో బెంగాల్ జట్టు ఈడెన్ గార్డెన్స్ లో ప్రాక్టీస్ చేస్తోంది. ఈ క్రమంలోనే దిండా వేసిన ఒక ఓవర్ లో బెంగాల్ ఆటగాడు వివేక్ సింగ్ స్ట్రయిట్ డ్రైవ్ చేశాడు. ఆ బాల్ ని పట్టుకునే ప్రయత్నంలో దిండా తలకు బంతి తగిలింది.