Asianet News TeluguAsianet News Telugu

బాక్సింగ్: మాజీ ఛాంపియన్‌కు షాకిచ్చిన తెలంగాణ అమ్మాయి

భారత బాక్సర్, తెలుగు తేజం నిఖత్ జరీన్ తన పంచ్ పవర్ విసిరేందుకు రెడీ అవుతోంది. రింగ్‌లోకి దిగితే మెడల్ గ్యారెంటీ అన్న రీతిలో ప్రత్యర్థులకు పంచులతో సవాలు విసురుతోంది. ఇస్తాంబుల్ బాస్పోరస్ బాక్సింగ్ టోర్నీలో సత్తా చాటేలా కనిపిస్తోంది. 

nikhat zareen stuns two time world champion nazym kyzaibay ksp
Author
İstanbul, First Published Mar 19, 2021, 8:16 PM IST

భారత బాక్సర్, తెలుగు తేజం నిఖత్ జరీన్ తన పంచ్ పవర్ విసిరేందుకు రెడీ అవుతోంది. రింగ్‌లోకి దిగితే మెడల్ గ్యారెంటీ అన్న రీతిలో ప్రత్యర్థులకు పంచులతో సవాలు విసురుతోంది. ఇస్తాంబుల్ బాస్పోరస్ బాక్సింగ్ టోర్నీలో సత్తా చాటేలా కనిపిస్తోంది. 

‌టర్కీలోని ఇస్తాంబుల్ వేదికగా జరుగుతున్న బోస్ఫోరస్‌ బాక్సింగ్‌ టోర్నీలో బాక్సింగ్ చాంపియన్ నజీమ్ కైజైబేను నికత్ జరీన్ మట్టికరిపించింది. నజీమ్‌ను చిత్తు చేసిన నిఖత్.. మహిళల 51 కేజీల విభాగంలో సెమీస్‌కు చేరింది. 

అంతకుముందు ఆమె ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌లో రష్యాకు చెందిన 2019 ప్రపంచ చాంపియన్ పాల్ట్‌సెవా ఎకాటెరినాను ఓడించింది. రింగ్‌లోకి దిగినప్పటి నుంచి ఉత్సాహంగా కనిపించిన నిఖత్ 4-1తో తిరుగులేని విజయాన్ని సాధించింది. ఆమె చేతిలో ఓటమి పాలైన కైజైబే 2014, 2016లో ప్రపంచ చాంపియన్‌షిప్స్‌ను సొంతం చేసుకుంది. ఈ గెలుపుతో జరీన్‌కు కనీసం కాంస్య పతకం మాత్రం గ్యారెంటీ.

Follow Us:
Download App:
  • android
  • ios