Asianet News TeluguAsianet News Telugu

neeraj chopra : గర్ల్ ఫ్రెండ్ విషయంలో ఆసక్తికరమైన కామెంట్ చేసిన నీరజ్ చోప్రా...

ఇప్పటివరకు నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు, భవిష్యత్తులో నన్ను ప్రేమించే నెచ్చెలి ఎవరైనా ఉంటారేమో చూద్దాం. ఇప్పుడు నేను పూర్తిగా కెరీర్‌పైనే దృష్టి పెట్టాను. ఈవెంట్లు, ప్రదర్శన, పతకాలు ఇవే నా ముందున్న వి.  మిగతావన్నీ ఆ  తర్వాతే. తదుపరి జరిగే పోటీలు, సన్నాహక శిబిరాలపై నే ఎక్కువగా ఆలోచిస్తాను’ అని చెప్పుకొచ్చాడు నీరజ్.

Neeraj Chopra Reveals He Has No Girlfriend, Says 'Focus is on My Game'
Author
Hyderabad, First Published Aug 11, 2021, 10:40 AM IST

టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణ కలను సాకారం చేశాడు నీరజ్ చోప్రా. జావెలిన్ థ్రోతో బంగారు పతకాన్ని దక్కించుకుని అందరి హృదయాల్నీ కొల్లగొట్టాడు. మంగళవారం భారత్ కు తిరిగి వచ్చిన నీరజ్ చోప్రాను భారత అథెటిక్స్ సమాఖ్య ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పుకొచ్చారు. 

మామూలుగా జావెలిన్ థ్రో అంటే పురుష అభిమానులే ఎక్కువగా ఉంటారని. అయితే ఒలంపిక్ టైటిల్ తో మహిళా అభిమానులు కూడా తన ఖాతాలో చేరారన్నారు. కానీ, ‘ఇప్పటివరకు నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు, భవిష్యత్తులో నన్ను ప్రేమించే నెచ్చెలి ఎవరైనా ఉంటారేమో చూద్దాం. ఇప్పుడు నేను పూర్తిగా కెరీర్‌పైనే దృష్టి పెట్టాను. ఈవెంట్లు, ప్రదర్శన, పతకాలు ఇవే నా ముందున్న వి.  మిగతావన్నీ ఆ  తర్వాతే. తదుపరి జరిగే పోటీలు, సన్నాహక శిబిరాలపై నే ఎక్కువగా ఆలోచిస్తాను’ అని చెప్పుకొచ్చాడు నీరజ్.

మరో ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘నాకు పానీపూరీలు అంటే ఇష్టం. కానీ టోక్యోలో ఈవెంట్ కోసం వాటిని తినలేదు. కడుపునొప్పి, ఇతర ఆరోగ్య సమస్యలు ఎందుకని వాటికి దూరంగా ఉన్నాను’ అని వ్యాఖ్యానించాడు. టోక్యో ఒలింపిక్స్ జావలిన్ త్రో లో స్వర్ణ పతకంతో చరిత్ర సృష్టించిన 23 ఏళ్ల నీరజ్ చోప్రా మంగళవారం స్వదేశానికి తిరిగి వచ్చాడు. ఈ సందర్భంగా నీరజ్ ను భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) ఘనంగా సన్మానించింది.

ఈ సన్మాన కార్యక్రమంలో తల్లిదండ్రులు సరోజాదేవి-సతీష్, చిన్నాన్న నా భీమ్ చోప్రా పాల్గొన్నారు. ఇక దేశంలో జావలిన్ త్రోకు ప్రాచుర్యం తెచ్చేందుకు ఏఎఫ్ఐ కీలక నిర్ణయం తీసుకుంది. నీరజ్ బంగారు పతకంతో మెరిసిన ఆగస్టు 7 వ తేదీని ‘జాతీయ జావెలిన్ డే’ గా నిర్వహిస్తామని ప్రకటించింది. 

కాగా.. ఈ టోక్యో ఒలంపిక్స్ కోసం నీరజ్ చోప్రా.. తనకు ఎంతో ఇష్టమైన హెయిర్ కట్ ని వదిలేసుకున్నాడట. ఈ విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది. స్వర్ణం గెలిచిన నాటి నుంచి నీరజ్ చోప్రా..కు సంబంధించిన పాత ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. ఆ ఫోటోల్లో నీరజ్ పొడవాటి జట్టుతో కనిపిస్తున్నాడు. అయితే.. ఇప్పుడు మాత్రం ఆ జట్టులేదు. ఈ ఒలంపిక్స్ కోసమే నీరజ్ తన జుట్టును త్యాగం చేయడం గమనార్హం.

టోక్యో ఒలంపిక్స్.. తనకు ఇష్టమైన హెయిర్ కట్ ని త్యాగం చేసిన నీరజ్ చోప్రా

టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లే ముందు, హర్యానాలోని పానిపట్‌లో నివసించే నీరజ్ చోప్రా జుట్టు కత్తిరించుకున్నాడు. నీరజ్ పొడవాటి జుట్టుతో ఉన్న వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన వారు.. ఇశాంత్ శర్మ.. షారూఖ్ ఖాన్ ల నుంచి హెయిర్ స్టయిల్ తీసుకున్నావా అని కామెంట్స్ పెట్టారు. 

నీరజ్ కి తన ఆట ఎంత ఇష్టమో పొడవాటి జుట్టు అన్నా అంతే ఇష్టం. అందుకే ఎక్కువగా పొడవాటి జుట్టును పెంచుకునేవాడు. అయితే, ఒలింపిక్స్ సన్నాహాలలో భాగంగా తన జుట్టును కత్తిరించుకున్నాడు.  ''పొడవాటి జుట్టు కారణంగా గత కొన్ని పోటీలలోనేను సమస్యలను ఎదుర్కొన్నాను. జుట్టు చెమట పట్టేది. అది కళ్ల ముందు కూడా వచ్చేది. దీంతో జుట్టును కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సి వచ్చింది. జావెలిన్ త్రోకు అది మరింత ఇబ్బంది అనిపించి జుట్టు కత్తిరించేసుకున్నాను.'' అని చెప్పడం విశేషం. 

Follow Us:
Download App:
  • android
  • ios