Asianet News TeluguAsianet News Telugu

Namanveer Singh Brar : జాతీయ షూటర్ అనుమానాస్పద మృతి..! హత్యా? ఆత్మహత్యా?

అనుమానాస్పదస్థితిలో చనిపోవడంతో కారణాలు తెలుసుకునే పనిలో పోలీసులు పడ్డారు. తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే, ఇది ఆత్మహత్యనా,  లేదా ప్రమాదవశాత్తు జరిగిందా అనేది ఇంకా తెలియలేదు.  

National level shooter Namanveer Singh Brar found dead with bullet wound in head
Author
Hyderabad, First Published Sep 14, 2021, 12:07 PM IST

పంజాబ్ : జాతీయ స్థాయి షూటర్ నమన్వీర్ సింగ్ బ్రార్ సోమవారం (సెప్టెంబర్ 13) మొహాలీ లోని తన ఇంట్లో శవమై కనిపించాడు. 28ఏళ్ల ఈ ట్రాప్ షూటర్ తలకు బుల్లెట్ గాయమైందని,  మొహాలీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ గుర్ షేర్ సింగ్ సంధు తెలిపారు.  

అనుమానాస్పదస్థితిలో చనిపోవడంతో కారణాలు తెలుసుకునే పనిలో పోలీసులు పడ్డారు. తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే, ఇది ఆత్మహత్యనా,  లేదా ప్రమాదవశాత్తు జరిగిందా అనేది ఇంకా తెలియలేదు.  

డిఎస్పి చెప్పిన వివరాల ప్రకారం ‘ ఆత్మహత్య చేసుకున్నాడా?  లేదా ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదానికి గురయ్యాడా?  అని కచ్చితంగా చెప్పలేం.  మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం  పంపించాం.  పోస్ట్ మార్టం నివేదిక కోసం వేచి చూస్తున్నాం.  నివేదిక వచ్చిన తర్వాత అసలు విషయం తెలుస్తుంది ఇది మాకు ఎంతో సహాయపడుతుంది’ అని సంధు తెలిపారు.

మొహాలీ లోని సెక్టార్ 71 ఇంట్లో బ్రార్ శవమై కనిపించడంతో కాల్పులు జరిగినట్లు కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించారు.  ఈ మేరకు పోలీసులు ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు.  

దక్షిణ కొరియాలో జరిగిన వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్ లో డబుల్ ట్రాప్ షూటింగ్ ఈవెంట్‌లో నమన్వీర్ సింగ్ బ్రార్ పాల్గొన్నాడు. ఈ పోటీల్లో కాంస్య పతకం కూడా సాధించాడు.  ఈ ఏడాది మార్చిలో ఢిల్లీలో జరిగిన  ఐఎస్ఎస్ఎఫ్  ప్రపంచ కప్ లో కనీస అర్హత స్కోర్ విభాగంలో పోటీ పడ్డాడు.

గతంలో పంజాబ్ విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా ఉన్న బ్రార్,  2015 లో దక్షిణ కొరియాలోని  గ్యాంగ్జులో జరిగిన వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్ లో డబుల్ ట్రాప్ టీం ఈవెంట్ లో  అంకుర్ మిట్టల్, అస్గర్ హుసేన్ ఖాన్ లతో కలిసి  పాల్గొని  కాంస్యం సాధించారు.

అదే ఏడాది నమన్వీర్ సింగ్ బ్రార్ ఆల్ ఇండియా యూనివర్సిటీ షూటింగ్ చాంపియన్షిప్ ను గెలుచుకున్నాడు. ఆ మరుసటి ఏడాది పోలాండ్ లో జరిగిన  ఎఫ్ఐఎస్ యు వరల్డ్ యూనివర్సిటీ షూటింగ్ చాంపియన్షిప్ లో బ్రార్ మరోసారి కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios