Asianet News TeluguAsianet News Telugu

కొత్త రాష్ట్రంలో ధోనీ పంద్రాగస్టు వేడుకలు

ప్రస్తుతం పుల్వామా జిల్లా క్రూ ప్రాంతంలో పారా రెజిమెంట్ యూనిట్ బాధ్యతలు నిర్వహిస్తున్న ధోనీ...  ఈ నెల 10వ తేదీన తన బృందంతో కలిసి లడఖ్ లోని లేహ్ ప్రాంతానికి వెళ్లనున్నాడని ఓ సైనికాధికారి చెప్పారు.
 

MS Dhoni likely to unfurl national flag in Leh on Independence Day
Author
Hyderabad, First Published Aug 9, 2019, 11:05 AM IST

టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నూతనంగా ఏర్పడిన రాష్ట్రం లఢక్ లో పంద్రాగస్టు వేడుకలు జరుపుకోనున్నారా..? అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది.   గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదా కలిగిన ధోనీ ...  ప్రస్తుతం భారత ఆర్మీలో విధులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా... స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇటీవల కొత్తగా ఏర్పడిన కేంద్ర పాలిత రాష్ట్రం లఢక్ లో ధోనీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనున్నట్లు సమాచారం. దీనిపై ఇప్పటివరకు అధికారులు అధికారికంగా ప్రకటన ఇవ్వనప్పటికీ... ధోనీ జెండా ఎగుర వేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

ప్రస్తుతం పుల్వామా జిల్లా క్రూ ప్రాంతంలో పారా రెజిమెంట్ యూనిట్ బాధ్యతలు నిర్వహిస్తున్న ధోనీ...  ఈ నెల 10వ తేదీన తన బృందంతో కలిసి లడఖ్ లోని లేహ్ ప్రాంతానికి వెళ్లనున్నాడని ఓ సైనికాధికారి చెప్పారు.

భారత ఆర్మీకి ధోనీ బ్రాండ్ అంబాసిడర్ అని ఓ సైనికాధికారి అన్నారు.  ప్రస్తుతం ధోనీ తాను విధులు నిర్వహిస్తున్న చోట తన బృంద సభ్యులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడని కొనియాడారు. వారితో కలిసి ఫుట్ బాల్, వాలీబాల్ ఆడుతున్నట్లు చెప్పారు. అలాగే సైనిక బలగాలతో కలిసి ఆర్మీ విధుల్లో పాల్గొంటున్నట్లు చెప్పారు. ఆగస్టు 15వరకు ధోనీ తన విధుల్లో కొనసాగుతాడని వారు తెలిపారు.

కాగా... పంద్రాగస్టు నాడు జమ్మూకశ్మీర్ లోని ప్రతి గ్రామంలో భారత త్రివర్ణ పతాకం ఎగురవేయాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ధోనీ లఢక్ లోని లెహ్ లో జెండా ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios