టీం ఇండియాకి ధోని అవసరం చాలా ఉందని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లతో జరగబోయే వన్డే మ్యాచ్ లకు టీం ఇండియా మాజీ కెప్టెన్ ధోనిని సెలక్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీని తర్వాత 2019లో జరగనున్న వరల్డ్ కప్ కి ధోనిని సెలక్ట్ చేస్తారా లేదా అనే సందేహం అందిరిలోనూ ఉంది. ఈ నేపథ్యంలో.. ఈ విషయంపై గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రపంచకప్ కి సెలక్ట్ చేసే టీంలో వికెట్ కీపర్ స్థానాన్ని ధోనికి కేటాయిస్తే బాగుంటుందని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు.  వరల్డ్ కప్ టోర్నీలో కెప్టెన్ విరాట్ కోహ్లీకి.. ధోని బాగా ఉపయోగపడతాడని ఆయన అన్నారు. ధోని వ్యూహాలు, అతడి సూచనలు టీం ఇండియా కు చాలా అవసరమని గవాస్కర్ అన్నారు.

ధోని 2011లో వరల్డ్ కప్ గెలిచిన అనుభవం ఉందని... ఒక్క ప్రపంచకప్ లోనే కాదు..ధోనికి అర్హత ఉండే అన్ని మ్యాచుల్లో అతనిని ఆడనివ్వాలన్నారు. అనంతరం రాహుల్ గురించి మాట్లాడుతూ.. టెస్టు మ్యాచుల్లో రాహుల్ ని ఎందుకు తీసుకుంటున్నారో అర్థం కావడంలేదన్నారు. ఐపీఎల్ స్థాయిలో రాహుల్ మంచి ఆటగాడని.. అలాంటి వ్యక్తి టీ0లకు సరిపోతాడు కానీ.. టెస్టు మ్యాచులకు కాదని అభిప్రాయపడ్డారు.