బాలీవుడ్ లోకి క్రికెటర్ షమీ భార్య.. హాట్ లుక్ తో ఫోటోషూట్

Mohammed Shami’s estranged wife Hasin Jahan to make her Bollywood debut in Fatwa
Highlights

ఐపీఎల్‌ చీర్‌ గర్ల్‌ అయిన ఈ మాజీ మోడల్‌.. అంజాద్‌ ఖాన్‌ దర్శకత్వంలో రూపొందనున్న ‘ఫత్వా’ సినిమాలో జర్నలిస్టుగా కనిపించనున్నారు. 

టీం ఇండియా క్రికెటర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ బాలీవుడ్ లో అడుగుపెడుతోంది. ఐపీఎల్‌ చీర్‌ గర్ల్‌ అయిన ఈ మాజీ మోడల్‌.. అంజాద్‌ ఖాన్‌ దర్శకత్వంలో రూపొందనున్న ‘ఫత్వా’ సినిమాలో జర్నలిస్టుగా కనిపించనున్నారు. ఈ మూవీ అక్టోబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనుంది.

ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించారు. ‘ నా కూతురిని పోషించడానికి కొంత సంపాదించాలనే ఉద్దేశంతో  సినిమాల్లో నటించాలనుకున్నాను. నాకు వేరే అవకాశం లేదు. దీంతోనే డైరెక్టర్‌ అంజాద్‌ ఖాన్‌ కలిసి సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. ఇక న్యాయంగా షమీ నుంచి రావాల్సిన భరణం గురించి పోరాడుతాను’అని జహాన్‌ మీడియాకు తెలిపారు. ఈ చిత్రం కోసం ఫొటో షూట్‌ నిర్వహించగా.. ఆ ఫొటోలను ఈ మాజీ మోడల్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. 

 

తన భర్త, క్రికెటర్ షమీ.. తనను హింసించాడంటూ గతంలో హసీన్ పోలీసు కేసు పెట్టిన సంగతి తెలిసిందే. అప్పుడు షమీపై ఆరోపణలు చేస్తూ వార్తల్లోకి ఎక్కిన హసీన్.. తాజాగా సినిమాలు చేస్తున్నానంటూ ప్రకటించి వార్తల్లో నిలిచారు.

loader