మిథాలి రాజ్ పై మరోసారి ట్రోలింగ్.. రిప్లై

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 16, Aug 2018, 4:56 PM IST
Mithali Raj Hits Twitter Troll For A Six With Perfect Response
Highlights

ఒక సెలబ్రెటీగా మీరు ఇలా చేయడం సరికాదు’ అంటూ కామెంట్లు వర్షం కురిపించారు.

భారత మహిళా క్రికెటర్ మిథాలిరాజ్.. మరోసారి నెటిజన్ల ట్రోలింగ్ బారిన పడ్డారు. గతంలో ఒకసారి ఆమె డ్రస్సు విషయంలో నెటిజన్ల విమర్శలు ఎదుర్కొన్న ఆమె.. ఈసారి  స్వాతంత్ర్య దినోత్సవం విషయంలో విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

 అసలు మ్యాటరేంటంటే...దేశవ్యాప్తంగా బుధవారం స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. రాజకీయ, క్రీడా, సినీ ప్రముఖులందరూ సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కానీ, మిథాలీరాజ్‌ మాత్రం బుధవారం అర్ధరాత్రి తన ట్విటర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపింది. దీంతో అభిమానులు స్వాతంత్ర్య దినోత్సవం అయిపోయాక శుభాకాంక్షలు చెబుతున్నావా. ఒక సెలబ్రెటీగా మీరు ఇలా చేయడం సరికాదు’ అంటూ కామెంట్లు వర్షం కురిపించారు.

దీంతో కాస్త నిరాశ చెందిన మిథాలీ... ‘నాకు సెలబ్రెటీ హోదా ఇవ్వడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. 1999 నుంచి నేను అథ్లెట్‌గా దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నాను. ప్రస్తుతం నేను ఛాలెంజర్స్‌ ట్రోఫీలో ఆడుతున్నాను. మైదానంలో ఉన్నంతసేపు మా వద్ద ఫోన్‌ ఉండదు. అలాగే టోర్నీ జరిగే సమయంలో నేను ఫోన్‌ వాడను. అందుకే ఆలస్యమైంది. నా కారణాన్ని ఒప్పుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తూ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు’ అని మిథాలీ వివరణ ఇచ్చింది.

ఇది చదవండి

సానియాపై నెటిజన్ కామెంట్... ఘాటు రిప్లై

loader