Asianet News TeluguAsianet News Telugu

అభిమాన హీరోని కలిసిన ఒలంపిక్ విన్నర్..!

అతని ట్వీట్ కి మీరాబాయ్ చాను రిప్లై ఇచ్చారు. థాంక్యూ సోమచ్ సల్మాన్ సర్.. నేను మీకు పెద్ద అభిమానిని.. మిమ్మల్ని కలవడం నా కల అంటూ ఆమె స్పందించారు.

Mirabai Chanu Meets Bollywood star SalmanKhan
Author
Hyderabad, First Published Aug 12, 2021, 11:31 AM IST

టోక్యో ఒలంపిక్స్ లో అదరగొట్టి.. దేశానికి రజత పతకం తీసుకువచ్చిన మీరా భాయ్ చాను.. తన అభిమాన హీరోని కలుసుకుంది. మీరాభాయ్ చాను.. బాలీవుడ్  స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కి వీరాభిమాని. కాగా.. తాజాగా.. ఆమె సల్మాన్ ని కలిసింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా.. ట్విట్టర్ వేదికగా తెలియజేసింది.

సల్మాన్ తో కలిసి దిగిన ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేసింది. ఈ సందర్భంగా.. వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ చాను కి... సల్మాన్ ఖాన్.. అభినందనలు తెలియజేశారు. ఈ ఫోటోలను సల్మాన్ కూడా షేర్ చేశారు. నీకు రజతం రావడం ఆనందంగా ఉందంటూ మీరాభాయ్ చాను క్యాప్షన్ ఇవ్వడం గమనార్హం. అంతేకాకుండా..  ఆమెను కలవడం చాలా ఆనందంగా ఉందని..  ఆమెకు బెస్ట్ విషెస్ తెలియజేశారు.

అతని ట్వీట్ కి మీరాబాయ్ చాను రిప్లై ఇచ్చారు. థాంక్యూ సోమచ్ సల్మాన్ సర్.. నేను మీకు పెద్ద అభిమానిని.. మిమ్మల్ని కలవడం నా కల అంటూ ఆమె స్పందించారు.

 

కాగా.. టోక్యో ఒలంపిక్స్ లో మీరాభాయ్ చాను.. 202 కేజీల బరువు ఎత్తారు. 49కేజీల విభాగంలో ఆమె రజతం సాధించారు. వీరి ట్విట్టర్ సంభాషణ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios