Asianet News TeluguAsianet News Telugu

ఇది రియల్ జెర్సీ కథ.. అచ్చం హీరో నాని లాగే..

హీరో నాని నటించిన జెర్సీ సినిమా చూశారా..? అందులో ఇండియన్ టీంకి ఆడాలనేది హీరో కల. తన ఆరోగ్యం క్రికెట్ కి సహరించదు అని తెలిశాక.. దానికి దూరం అవుతాడు. 

men died during playing cricket match in surat
Author
Hyderabad, First Published May 7, 2019, 11:13 AM IST

హీరో నాని నటించిన జెర్సీ సినిమా చూశారా..? అందులో ఇండియన్ టీంకి ఆడాలనేది హీరో కల. తన ఆరోగ్యం క్రికెట్ కి సహరించదు అని తెలిశాక.. దానికి దూరం అవుతాడు. పదేళ్ల తర్వాత 36ఏళ్ల వయసులో మళ్లీ బ్యాటింగ్ పడతాడు.. కానీ ప్రాణాలు కోల్పోతాడు.  అచ్చం ఇదేవిధంగా ఓ వ్యక్తి గుజరాత్ లో ప్రాణాలు కోల్పోయాడు.

జహంగీర్‌పూర్‌లోని మరిమళ్ సొసైటీకి చెందిన ప్రిమల్ ఈశ్వర్ భాయీ టెలర్(37) సీటీవో కార్యాలయంలో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. అతనికి క్రికెట్ ఆడటమంటే ఎంతో ఇష్టం. స్థానికంగా జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొన్నాడు. అతని టీమ్ బ్యాటింగ్ పూర్తి చేశాక, ఫీల్డింగ్ చేస్తోంది. ఈ సమయంలో ప్రిమల్ బౌలింగ్ చేస్తున్నాడు. 

ఉన్నట్టుండి కింద పడిపోయాడు. వెంటనే అక్కడివారంతా అతనిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ప్రిమల్ మృతి చెందాడని వైద్యులు నిర్థారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా 2015లో ప్రిమల్‌కు హృద్రోగ సంబంధిత చికిత్స జరిగింది. అప్పట్లో వైద్యులు అతనితో క్రికెట్ లాంటి ఆటలు ఆడవద్దని సూచించారు. అయినా ప్రిమల్ క్రికెట్ ఆటను మానలేదు. చివరకు ప్రాణాలు కోల్పోయాడు. 

కాకపోతే సినిమాలో హీరో చనిపోతానని తెలిసి కొడుకు కోసం ఆడతాడు.. ఇక్కడ ఇతను మాత్రం చనిపోతానని తెలిసి క్రికెట్ మీద పిచ్చితో ఆడాడు అంతే తేడా.

Follow Us:
Download App:
  • android
  • ios