తెలిసి సరదాకి అన్నాడో.. తెలియక అన్నాడో గాని గుప్తిల్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆదివారం భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య టోర్నీలో భాగంగా రెండో టీ20 మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ అనంతరం జరిగిన ఒక సంభాషణలో కలుగజేసుకున్న చాహల్ ని గుప్తిల్ బూతుతో పలకరించడం అందరిని షాక్ కి గురి చేసింది.

పంత్ భవితవ్యంపై నీలి నీడలు... వాట్ నెక్స్ట్...?

అయితే అభిమానులు సైతం దీన్ని పెద్దగా సీరియస్ తీసుకోవడం లేదు. ఎందుకంటె గుప్తిల్ చాహల్ ముందు నుంచి మంచి స్నేహితులని అందరికి తెలిసిన విషయమే. అసలు మ్యాటర్ లోకి వెళితే.. మ్యాచ్ ముగిసిన తరువాత రోహిత్ శర్మ - మార్టిన్ గుప్తిల్ మాట్లాడుకుంటూ ఉండగా.. వారి సంభాషణ మధ్యలోకి చాహల్ చేరి వారిని పలకరించే ప్రయత్నం చేస్తూ.. ఏం జరిగిందని అడిగాడు.

దీంతో వెంటనే.. గుప్తిల్ క్యా.. అంటూ.. చెప్పారని బూతు మాట్లాడాడు. వేంటనే ఆ మాటకు రోహిత్ - చాహల్ పక్కున నవ్వారు. దీంతో సోషల్ మీడియాలో వీరి సంబాషణపై మీమ్స్ వెలువడుతున్నాయి. నిజంగా ఆ పదానికి గుప్తిల్ కి అర్ధం తెలుసా తెలియదా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక నిన్న జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ పై భారత్ 7వికెట్లతో విజయాన్నిఅందుకుంది. 5 టీ20 ల సిరీస్ లో భాగంగా 2-0 ఆధిక్యంతో టీమిండియా సిరీస్ కైవసం చేసుకోవడానికి మరో విజయం దూరంలో ఉంది.