శ్రీలంక పేస్ బౌలర్ మళింగ అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలకనున్నారా..? అవుననే సమాధానమే వినపడుతోంది. అంతర్జాతీయ క్రికెట్ కి దూరం అవ్వాలని ఆయన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

తన నిర్ణయాన్ని ఆయన తన ప్లేయర్స్ వాట్సాప్ గ్రూప్ లో తెలియజేశారు. ‘‘మళ్లీ మిమ్మల్ని మైదానంలో కలవకపోవచ్చు. ఇప్పటి వరకు నా పక్కనే ఉండి తనను ప్రోత్సహించిన అందరికీ దన్యవాదాలు. మీ అందరికీ దేవుడు ఆశీస్సులు ఉండాలి’’ అని ఆయన ప్లేయర్స్ గ్రూప్ లో పోస్టు చేశారు.టీమ్ చీఫ్ సెలక్టర్ అశాంత డే మెల్.. మళింగకు ఫోన్ చేసిన సరిగ్గా గంట తర్వాత ఆయన ప్లేయర్ గ్రూప్ లో అలాంటి మెసేజ్ పెట్టడం గమనార్హం.

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు... మళింగకు కెప్టెన్సీ ఇవ్వడం విషయంలో చీఫ్ సెలక్టర్ స్పష్టమైన హామీ ఇవ్వలేకపోయారని.. అందుకే మళింగ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

మళింగ కెప్టెన్సీ కన్నా కూడా.. దేశం గురించి ఆలోచిస్తే బాగుండేదని.. గతంలో మళింగ కెప్టెన్సీలో 14 మ్యాచుల్లో 13 ఓడిపోయారన్న విషయం గుర్తుంచుకోవాలని ఓ శ్రీలంక క్రికెట్ బోర్డ్ కి చెందిన వ్యక్తి పేర్కొనడం గమనార్హం.