ఆసియాకప్ లో భాగంగా మంగళవారం అఫ్గానిస్తాన్-భారత్ మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా మిగిలిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో తప్పంతా రాహుల్ దే నంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. కేఎల్ రాహుల్ రివ్యూ తీసుకోకపోయి ఉంటే.. భారత్ మ్యాచ్ గెలిచేదనని అభిమానులు అభిప్రాయపడ్డారు. కాగా.. వీటిపై రాహుల్ తాజాగా స్పందించాడు.

‘ఒకే రివ్యూ అవకాశం ఉన్నప్పుడు చాలా కష్టం. కానీ నేను ఆ సమీక్షకు వెళ్లాల్సింది కాదు. కానీ ఆ సమయంలో బంతి అవతలివైపు వెళ్లిందో ఏమో అని భావించాను. అలా వచ్చే అవకాశాన్ని అందిపుచ్చుకోవాలనుకున్నాను. మేం బాధపడటం లేదు బంతి నెమ్మదిగా స్పిన్‌ అవుతోంది. ఇది మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌కు చాలా కష్టం. ఈ పరిస్థితుల్లో కూడా దినేశ్‌ కార్తీక్‌ అద్భుతంగా ఆడాడు. కేదార్‌ జాదవ్‌తో మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. చివర్లో జడేజా,దీపక్‌ చహల్‌ పోరాటం కూడా ఆకట్టుకుంది. ఓపెనర్‌గా బరిలోకి దిగినప్పుడే మిడిలార్డర్‌పై ఒత్తిడి లేకుండా చేయాలనుకున్నాను’ అని తెలిపాడు.

చివరి ఓవర్లో విజయానికి భారత్‌కు 7 పరుగులు కావాలి.  క్రీజ్‌లో జడేజా ఉన్నాడు. నాలుగు బంతుల తర్వాత స్కోర్లు సమమయ్యాయి. మరో రెండు బంతుల్లో సింగిల్‌ తీయాల్సి ఉండగా అఫ్గాన్‌ సంచలనం జడేజాను బోల్తా కొట్టించాడు. జడేజా భారీ షాట్‌కు ప్రయత్నించి  క్యాచ్‌ ఔట్‌ కావడంతో మ్యాచ్‌ ‘టై’గా ముగిసింది.