Asianet News TeluguAsianet News Telugu

కేపీఎల్ లో దుమ్మురేపిన గౌతమ్.. 134 నాటౌట్

39బంతుల్లో సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. 56బంతుల్లో 7ఫోర్లు, 13 సిక్సర్లతో 134 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కేపీఎల్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు, అత్యధిక సిక్సర్ల రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. గౌతమ్ భీకర ఇన్నింగ్స్ తో టస్కర్ నిర్ణీత 17 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది.
 

K Gowtham breaks T20 records with 39-ball ton and eight-wicket haul in same KPL match
Author
Hyderabad, First Published Aug 24, 2019, 12:24 PM IST

కర్ణాటక ప్రీమియర్ లీగ్(కేపీఎల్) లో ఆల్ రౌండర్ కృష్ణప్ప గౌతమ్ తన బ్యాటింగ్ ప్రదర్శనతో అందరినీ మంత్రముగ్ధులను చేశాడు.  బ్యాటింగ్, బౌలింగ్ లో అత్యుత్తమ ప్రదర్శన కనపరిచాడు. బళ్లారి టస్కర్స్ జట్టు తరపున బరిలోకి దిగిన గౌతమ్ ఈ టోర్నమెంట్ చరిత్రలో అతి తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన బ్యాట్స్ మన్ గా నిలిచాడు.

39బంతుల్లో సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. 56బంతుల్లో 7ఫోర్లు, 13 సిక్సర్లతో 134 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కేపీఎల్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు, అత్యధిక సిక్సర్ల రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. గౌతమ్ భీకర ఇన్నింగ్స్ తో టస్కర్ నిర్ణీత 17 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది.

భారీ లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన షిమోగా లయన్స్ టీమ్ ను తన బౌలింగ్ తో గౌతమ్ వణికించాడు. అతని ధాటికి లయన్స్ బ్యాట్స్ మెన్ పెవిలియన్ కు వరస కట్టారు. ఏకంగా 8 వికెట్లు పడగొట్టి లయన్స్ ని మట్టికరిపించాడు. అత్యధికంగా వ్యక్తిగత స్కోరు మాత్రమే కాకుండా అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ గా కూడా రికార్డు సృష్టించాడు.  గౌతమ్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో 70 పరుగుల తేడాదో లయన్స్ పరాజయం పాలయ్యింది. 

Follow Us:
Download App:
  • android
  • ios