జూనియర్ డేవిస్ కప్ టెన్నిస్ టోర్నీలో భారత్.. ఇండోనేషియాపై క్లీన్‌స్వీప్ చేసింది. ఈ టోర్నీలో మొదట న్యూజిలాండ్ చేతిలో ఓడిన భారత్ తర్వాత కోలుకుంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో అజయ్ మాలిక్ సింగిల్స్, డబుల్స్ మ్యాచ్‌ల్లో గెలుపొందాడు.

ఆసియా ఓసియానియా ఫైనల్ క్వాలిఫయింగ్ పోరులో మొదట సింగిల్స్ ఆడిన అజయ్ 6-4, 6-0తో మో గున్‌వన్ త్రిస్మువంతరను ఓడించాడు. రెండో సింగిల్స్‌లో సుశాంత్ దబస్ 6-0,6-0తో నౌవల్డో జతి అగత్రపై గెలిచి భారత్‌కు విజయాన్ని అందించాడు.

డబుల్స్‌లో అజయ్-దివేశ్ గెహ్లాట్ జోడీ 6-7, 6-2, 10-4తో నౌవల్డో అగత్ర- లక్కీ కెండ్ర కుర్నివాన్ జంటపై గెలిచింది. ఈ టోర్నీలో భారత్ తన తర్వాతి మ్యాచ్‌లో .. ఆసియా ఓసియానియా గ్రూప్‌లో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియాతో తలపడుతుంది.