భారత్ ఖాతాలో మరో స్వర్ణం వచ్చి చేరింది. ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ షూటింగ్ లో భారత్ సోమవారం రెండు పతకాలు సొంతం చేసుకుంది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్ డ్ విభాగంలో అపూర్వి చండేలా- దీపక్ కుమార్ జోడీ స్వర్ణం సాధించింది.

చైనాకి చెందిన కియాన్ యాంగ్- హోనన్ యు జంటను ఓడించి వీరు పతకాన్ని సాధించారు. భారత్ కి చెందిన మరో జోడి అంజుమ్ మౌడ్గిల్- దివ్యాన్ష్ 10మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్ డ్ విభాగంలో హంగేరియన్ జోడిని ఓడించి కాంస్య పతకం సాధించింది.