టీం ఇండియా యువ క్రికెటర్ ని ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్ జట్టు ఎంపిక చేసుకుంది. కాగా.. ఈ రోజు బెంగళూరు వేదికగా ముంబయి ఇండియన్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్ లో బుమ్రా ఆడటం కష్టమేనని తెలుస్తోంది.

గాయం కావడంతో ఈ మ్యాచ్ కి బుమ్రా దూరంకానున్నట్లు సమాచారం. ప్రాక్టీస్ మ్యాచ్ లో పాల్గొన్నప్పటికీ.. మరికొంత విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారట. దీంతో ఈ మ్యాచ్ కి బుమ్రా దూరం కావడం ఖాయమని చెబుతున్నారు.

ఆదివారం దిల్లీతో మ్యాచ్ సందర్భంగా అతడి ఎడమ భుజానికి గాయమైన విషయం తెలిసిందే. దీంతో మైదానంలో బుమ్రా విలవిల్లాడాడు. ఢిల్లీ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌పంత్‌ కొట్టిన షాట్‌ను ఆపబోతుండగా ఎడమ భుజానికి గాయమైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో తొమ్మిది వికెట్లు పడినా బుమ్రా బ్యాటింగ్‌కు రాలేదు.