ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం కి క్రికెటర్ శిఖర్ ధావన్ గుడ్ బై చెప్పేశాడు. ఎన్నో సంవత్సరాలుగా శిఖర్ ధావన్ ఈ టీంకి ఆడుతూ వచ్చాడు. అయితే.. ఇప్పుడు సడెన్ గా ఆ జట్టు నుంచి శిఖర్ ధావన్ తప్పుకోవడం గమనార్హం.

ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో తనని తక్కువ ధరకే సన్ రైజర్స్ జట్టు దక్కించుకోవడం ధావన్ కి నచ్చలేదు. ఈ విషయంలో జట్టు యాజమాన్యంతో ధావన్ గొడవలు పడ్డట్టుగా ఆ మధ్యకాలంలో వార్తలు కూడా వచ్చాయి. శిఖర్ ధావన్ దక్కించుకోవాడనికి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ చివరి వరకూ ప్రయత్నించినప్పటికీ.. రూ.5.2కోట్లకి ఆర్టీఎం ద్వారా హైదరాబాద్ దక్కించుకుంది.

అయితే.. తనకు మరింత ఎక్కువ ధర వచ్చే అవకాశం ఉన్నప్పటికీ.. సన్ రైజర్స్ కారణంగా తక్కువ ధర పాడటం పట్ల ధావన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలోనే 2019 ఐపీఎల్ సీజన్ హైదరాబాద్ టీం కి ఆడనని చెప్పేశాడు.

 

శిఖర్ చెప్పిన విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం తాజాగా ఢిల్లీ డేర్ డెవిల్స్ కి ధావన్ ఇచ్చేసి.. ఆ జట్టు నుంచి విజయ్ శంకర్(రూ.3.2కోట్లు), నదీమ్(రూ.3.2కోట్లు),  అభిషేక్ శర్మ(రూ.55లక్షలు)లను తీసుకుంది. ఈ ఏడాది వేలం ప్రకారం ఈ ముగ్గురి ధర రూ.6.95కోట్లు కాగా.. ధావన్ ధరని మినహాయించి మిగిలిన సొమ్ముని ఢిల్లీ డేర్ డెవిల్స్ కి హైదరాబాద్ జట్టు చెల్లించనుంది.