Asianet News TeluguAsianet News Telugu

పంత్ భారీ షాట్లు... ఏడ్చేసిన సన్ రైజర్స్ కోచ్

ఢిల్లీ క్యాపిటల్స్ యువ క్రికెటర్ రిషబ్ పంత్... తన బ్యాటింగ్ ని ఝులిపించాడు.  తన బ్యాటింగ్ ప్రతిభతో సన్ రైజర్స్ టీం ని మట్టి కరిపించాడు. రిషబ్ కారణంగానే... సన్ రైజర్స్ నిన్నటి మ్యాచ్ ఓడిపోయింది. 

IPL 2019: Tom Moody cries on SRH loss against DC in IPL2019
Author
Hyderabad, First Published May 9, 2019, 10:12 AM IST

ఢిల్లీ క్యాపిటల్స్ యువ క్రికెటర్ రిషబ్ పంత్... తన బ్యాటింగ్ ని ఝులిపించాడు.  తన బ్యాటింగ్ ప్రతిభతో సన్ రైజర్స్ టీం ని మట్టి కరిపించాడు. రిషబ్ కారణంగానే... సన్ రైజర్స్ నిన్నటి మ్యాచ్ ఓడిపోయింది. గెలుస్తామనుకున్న మ్యాచ్ కళ్లముందే ఓడిపోతుంటే... సన్ రైజనర్స్ కోచ్  స్టేడియంలో కన్నీళ్లు పెట్టుకున్నాడు.

విశాఖపట్నం వేదికగా బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో రిషబ్ పంత్ (49: 21 బంతుల్లో 2x4, 5x6) చెలరేగడంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 2 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై గెలిచి క్వాలిఫయర్-2లో దూసుకెళ్లింది. కేవలం 12 పాయింట్లతో లక్కీగా ప్లేఆఫ్ బెర్తు కొట్టేసిన హైదరాబాద్.. ఈ మ్యాచ్‌లో ఓడటం ద్వారా ఇంటి బాట పట్టింది. 

మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ టీం గెలుస్తుందని అందరూ భావించారు. వారి ఆశలను పంత్ అడియాశలు చేశాడు. ఒక్క ఓవర్ లో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసేసాడు. కళ్లముందే మ్యాచ్ చేజారుతుండటంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ హెడ్‌కోచ్ టామ్ మూడీ స్టేడియంలోనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. మూడీ కన్నీళ్లు పెట్టుకుంటున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios