రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్ మెన్ సంజు శాంసన్ ఇప్పుడు అరుదైన రికార్డును సాధించాడు. విరాట్ కోహ్లీ, విరేంద్ర సెహ్వాగ్, మురళీ విజయ్ తర్వాత స్థానంలో సంజు నిలిచాడు. ఐపీఎల్ లో ఒకటి కన్నా ఎక్కువ సెంచరీలు చేసిన భారత బ్యాట్స్ మెన్ లలో నాలుగో స్థానంలో సంజు నిలిచాడు.

హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేధికగా శుక్రవారం రాత్రి సన్ రైజర్స్ హైదరాబాద, ఆర్సీబీ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. కాగా మ్యాచ్‌లో 55 బంతుల్లో 102 పరుగులు చేయడం ద్వారా ఐపీఎల్‌లో రెండో శతకం నమోదు చేశాడు. 

అంతకుముందు రైజింగ్‌ పుణె సూపర్‌గెయింట్స్‌పై 2017లో మొదటిసారి శతకం చేశాడు. దీంతో ఐపీఎల్‌లో ఒకటి కంటే ఎక్కువ శతకాలు సాధించిన భారత ఆటగాళ్లు విరాట్‌కోహ్లీ(4), సెహ్వాగ్‌(2), మురళీ విజయ్‌(2) సరసన చేరాడు.