ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ.. తమ జట్టు ఆటగాడు రాహుల్ చహర్ పై ప్రశంసల జల్లు కురిపించాడు. చహర్ కి తెలివితేటలు చాలా ఎక్కువని.. ఎడమచేతి వాటం బ్యాట్స్ మెన్ కు అద్భుతంగా బౌలింగ్ చేస్తాడని కొనియాడాడు.

గురవారం ఫిరోజ్ షా కోట్ల మైదానం వేదిగా జరిగిన మ్యాచ్ లో ఢిల్లీని ముంబయి చిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో చహర్ విధ్వంసం సృష్టించాడు. చహర్ కారణంగానే మ్యాచ్ గెలిచింది. ఈ క్రమంలో  చహర్ పై రోహిత్ ప్రశంసల జల్లు కురిపించాడు.

‘ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్‌కు బౌలింగ్‌ చేసే విషయంలో చహర్‌ మొత్తానికి ఎదో చేశాడు. అతను గతేడాది కూడా జట్టులో ఉన్నప్పటికి ఆడే అవకాశం అంతగా రాలేదు. ఒక దశలో మేం అతనికి అవకాశం కల్పించాం. తను ఏం చేయాలో దాన్ని పర్‌ఫెక్ట్‌గా అమలు చేస్తాడు. తన వ్యూహాన్ని అమలు పరచడంలో చాలా తెలవిగా వ్యవహరిస్తాడు. లెఫ్టాండర్స్‌కు బౌలింగ్‌ చేయడంపై చాలా విశ్వాసంగా ఉంటాడు. కెప్టెన్‌ అతనిపై నమ్మకం ఉంచితే చాలా ఇరగదీస్తాడు. ఇక తొలి రెండు ఓవర్ల తర్వాత 140 పరుగుల లక్ష్యం చాలులే అనుకున్నాం. మేం అందరం అలానే భావించాం. కానీ అదృష్టవశాత్తు.. మా చేతిలో వికెట్లు ఉన్నాయి. డెత్‌ ఓవర్లలో పరుగులు చేయడానికి మా పవర్‌ హిట్టర్స్‌ ఉపయోగించాలనుకున్నాం. మా స్పిన్నర్ల నైపుణ్యం మాకు తెలుసు. మా ప్రణాళికను విజయవంతగా అమలు చేశాం’ అని రోహిత్‌ చెప్పుకొచ్చాడు.