సొంత గడ్డపై మరోసారి చెన్నై... ముంబయి చేతిలో ఓడిపోయింది. ఐపీఎల్ 2019 సీజన్ తొలి క్వాలిఫయిర్ మ్యాచ్ లో చెన్నైని ముంబయి చిత్తుగా ఓడిచింది. ముంబయి డైరెక్ట్ గా ఫైనల్ కి చేరింది. కాగా.. ఈ మ్యాచ్ ఓడినా... చెన్నైకి ఫైనల్ కి చేరుకునే మరో అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. ముంబయి చేతిలో చెన్నై ఓడిపోవడాన్ని ధోనీ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.

అందుకే..కెప్టెన్ ధోనీని కూడా నెటిజన్లు వదలడం లేదు. ధీని సహా... మొత్తం చెన్నై సూపర్ కింగ్స్ టీం ని ట్రోల్స్ తో ఏకి పారేస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ ఆట ఎలా ఆడారో చెబుతూ ట్రోల్స్ చేస్తున్నారు. మ్యాచ్ ఓడిన తర్వాత చెన్నై పరిస్థితి ఇలా ఉందంటూ...మీమ్స్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఐపీఎల్ ఇప్పటి వరకూ 27సార్లు ఈ రెండు జట్లూ తలపడగా.. ముంబయి ఏకంగా 16 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. చెన్నై 11 మ్యాచ్‌ల్లో గెలిచింది. టోర్నీలోని అన్ని జట్లపైనా చెన్నై ఆధిపత్యం చెలాయిస్తే..? చెన్నైపైనే ఆధిపత్యం చెలాయించగలిగే ఏకైక జట్టు తామేనని ముంబయి ఇండియన్స్ చాలాసార్లు నిరూపించుకుంది. ఎంతలా అంటే.. చెన్నై సొంతగడ్డ చెపాక్‌లో 2010 నుంచి ఒక్కసారి కూడా చెన్నై చేతిలో ముంబయి ఓడిపోలేదు.