ఐపీఎల్ సీజన్ 12లో భాగంగా మొహాలీలోని ఐఎస్ బృందా స్టేడియం వేదికగా ముంబయి ఇండియన్స్, కింగ్ ఎలెవన్స్ పంజాబ్ మధ్య మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ మ్యాచ్ లో తాజాగా ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.

ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచి  పంజాబ్ ఎలవెన్స్  ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ముంబయి ఇండియన్స్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. కాగా.. తొలి ఓవర్ లో బౌలింగ్ అశ్విన్ చేశాడు.

అయితే.. సాధారణంగా ఓవర్ కి 6 బంతులు అయితే.. అశ్విన్ మాత్రం ఏడు బంతులు వేశాడు. అక్కడున్నవారేవెరూ ఈ విషయాన్ని గ్రహించకపోవడం విశేషం.తొలుత అంతా ఆరు బంతులుగా మాత్రమే భావించి బ్రేక్ ఇచ్చారు. అయితే బ్రేక్ తర్వాత కూడా అశ్విన్ మరో బంతిని వేయగా.. ఆ బంతిని ముంబై ఓపెనర్ డి కాక్ బౌండరీకి తరలించాడు. అయితే ఎటువంటి ఎక్స్‌ట్రా లేకుండా.. అశ్విన్ ఒక ఓవర్‌లో ఏడు బంతులు వేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
 
కాగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ ఆరంభం నుంచి కింగ్స్ జట్టు వివాదాలకు కేంద్రంగా మారింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనూ అశ్విన్, బట్లర్‌ను మన్కడింగ్‌తో ఔట్ చేసి తీవ్ర వివాదానికి తెరలేపాడు.