ఐపీఎల్.. ఢిల్లీ క్యాపిటల్స్ కి సలహాదారుడిగా గంగూలీ

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 14, Mar 2019, 3:44 PM IST
IPL 2019: Delhi Capitals appoint Sourav Ganguly as advisor
Highlights

భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మరోసారి ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. 

భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మరోసారి ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. గతంలో కోల్ కతా నైట్ రైడర్స్ తరపున ఆడి అలరించిన గంగూలీ.. చాలా కాలం తర్వాత  మళ్లీ ఐపీఎల్ లో అడుగుపెడుతున్నాడు. ఈ సారి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి సలహాదారుడిగా గంగూలీ వ్యవహరించనున్నాడు.

గంగూలీని తమ జట్టు సలహాదారుడిగా నియమించుకున్నట్లు ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ ప్రకటించింది. ఇప్పటికే టీమ్ హెడ్‌ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఉన్న విషయం తెలిసిందే. 

‘సౌరవ్ గంగూలీ‌కి క్రికెట్‌లో అపారమైన అనుభవం ఉంది. అతని దూకుడు, వెన్నుచూపని ధైర్యం, తెగింపు ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టులోనూ నింపాలని ఆశిస్తున్నాం’ అని ఢిల్లీ ఫ్రాంఛైజీ వెల్లడించింది. ఈ నియామకంపై గంగూలీ కూడా స్పందించాడు. ‘ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బోర్డులో చేరడం ఆనందంగా ఉంది’ అని చెప్పుకొచ్చాడు.

ఢిల్లీ డేర్ డెవిల్స్ పేరును ఢిల్లీ క్యాపిటల్స్ కి పేరు మార్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా.. అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత.. కొన్నాళ్లు క్రికెట్ వ్యవహారాలకి దూరంగా ఉన్న గంగూలీ.. ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. 

loader