ఐపీఎల్( ఇండియన్ ప్రీమియర్ లీగ్) 12వ సీజన్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ల కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. కాగా.. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి ఆదిలోనే ఊహించని షాక్ తగిలింది.

గాయం కారణంగా జట్టు పేసర్ లుంగీ ఎంగిడీ పూర్తి సీజన్‌కి దూరం అయ్యాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన ఐదో వన్డేలో అతని పక్క భాగంలో గాయం కావడంతో ఈ సిరీస్ నుంచి అతను తప్పుకుంటున్నట్లు క్రికెట్ సౌతాఫ్రికా ప్రకటించింది. గత సీజన్2లో జరిగిన వేలంలో సీఎస్‌కే ఎంగిడిని దక్కించుకుంది. గత సీజన్‌లో ఏడు మ్యాచులు ఆడిన ఇతను 11 వికెట్లు తీశాడు.

రెండేళ్ల నిషేధం తర్వాత చెన్నై సూపర్ కింగ్స్.. ఐపీఎల్ లోకి అడుగుపెడుతోంది. దీంతో... జట్టుపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే.. మ్యాచ్ మొదలుకాకుండానే లుంగీ ఎంగిడీ దూరం కావడం నిరాశకు గురిచేస్తోంది.