ఐపీఎల్ పుణ్యామా అని... రోజుకు ఒకరు ఫేమస్ అయిపోతున్నారు. నచ్చిన టీం జెర్సీ వేసుకొని స్టేడియంలో కూర్చుంటే చాలు.. అమ్మాయిలకు విపరీతమైన ఫాలోయింగ్ పెరిగిపోతోంది. మొన్నటికి మొన్న ఆర్సీబీ ఫ్యాన్ గర్ల్ అంటూ... ఓ యువతిని పాపులర్ చేశారు.  ఇప్పుడు ముంబయి ఫ్యాన్ గర్ల్ అంటూ మరొకరు పాపులర్ అయ్యారు. ఈ ముంబయి ఫ్యాన్ గర్ల్ ఇప్పుడు నెట్టింట ఫేమస్ గా మారింది. ఆర్సీడీ ఫ్యాన్ గర్ల్ ని మించిన ఫాలోయింగ్ ని ఈ యువతి సొంతం చేసుకుంది.

ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ మ్యాచ్‌లో ఈ యువతి ఓ మెరుపు మెరిసింది. చిరునవ్వులు చిందిస్తూ.. కేరింతలు కొడుతున్న ఆమె టీవీలో అలా ఫ్లాష్ అయ్యిందో లేదో.. ఇలా ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమైంది. మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతున్న సమయంలో కూడా కెమేరా మ్యాన్‌ ఆమెనే ఫోకస్ చేశాడు. అంతే అందరి కళ్లు ఆమెపై పడ్డాయి. 

ఇక ఫైనల్ ముగియగానే.. నెటిజన్స్ ఈ అమ్మాయి గురించి తెలుసుకోడానికి ప్రయత్నించారు.ఆమె పేరు అతిథి హుందియా. 2018లో మిస్ దివా సూపర్ నేషనల్ టైటిల్ గెలుపొందింది. పోలాండ్‌లో జరిగిన అందాల పోటీలో ఆమె ఇండియా తరఫున పాల్గొంది. ఆమెను ఐపీఎల్ అభిమానులకు పరిచయం చేసినందుకు కెమేరామెన్ కి ఒక ట్రోఫీ ఇవ్వాల్సిందేనని నెటిజన్లు కామెంట్స్ చేయడం విశేషం.