టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ... ఇద్దరూ వర్క్ పరంగా ఎప్పుడూ బిజీగానే ఉంటారు. అయినప్పటికీ.. తమ పర్సనల్ లైఫ్ కి మాత్రం ఎలాంటి ప్రాబ్లం రాకుండా జాగ్రత్తలు పడుతూ ఉంటారు. ప్రస్తుతం టీ 20, వన్డే సిరీస్ లో భాగంగా టీం ఇండియా వెస్టిండీస్ లో ఉన్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే టీ20 సిరీస్ ముగియగా.. క్లీన్ స్వీప్ చేసి కోహ్లీ సేన సిరీస్ గెలిచింది. నేటి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. కాగా... ఈ మధ్యలో వచ్చిన చిన్న గ్యాప్ లో విరాట్... తన భార్య అనుష్క శర్మ తో లంచ్ డేట్ కి వెళ్లారు. ఇద్దరూ కలిసి వెస్టిండీస్ లోని గుయానాలో పర్యటిస్తూ... ఇద్దరూ కలిసి లంచ్ చేశారు.

తన లవ్లీ వైఫ్ తో కలిసి లంచ్ చేశానంటూ కోహ్లీ ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటోని రెస్టారెంట్ దగ్గర దిగారు. ఇద్దరూ ఎంతో ఆనందంగా కనిపిస్తున్నారు. కాగా.. ఆఫోటో ఇరువురి అభిమానులను ఎంతగానో కట్టిపడేస్తోంది. లవ్లీ కపుల్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. వీరిద్దరూ కలిసి బయటకు వెళ్లిన ఫోటోలను అనుష్క శర్మ కూడా తన సోషల్ మీడియాలో పోస్టు చేసింది.