Asianet News TeluguAsianet News Telugu

ఇండోనేషియా మాస్టర్స్...టైటిల్ దిశగా సైనా

భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఇండోనేషియా మాస్టర్స్  ఓపెన్ బ్మాడ్మింటన్ టోర్నీలో సంచలనాలు సృష్టిస్తోంది. 

Indonesia Masters: Saina Nehwal comes back from a game down against He Bingjiao to reach final
Author
Hyderabad, First Published Jan 26, 2019, 4:53 PM IST

భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఇండోనేషియా మాస్టర్స్  ఓపెన్ బ్మాడ్మింటన్ టోర్నీలో సంచలనాలు సృష్టిస్తోంది. ఈ టోర్నీలో సైనా నెహ్వాల్ విజయం దిశగా దూసుకెళ్తోంది. 

సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్ లో ఆరోసీడ్ హే బిన్ గ్జియావో( చైనా) తో తలపడిన సైనా.. విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ లో తొలి సెట్ ను బిన్ గ్జియావో 18-21 తేడాతో కైవసం చేసుకుంది. ఆ తర్వాతి సెట్ లో సైనా విజృంభించింది.  రెండు, మూడు సెట్ లను 21-12, 21-18 తేడాతో విజయం సాధించింది.

 కాగా చైనా షెట్లర్ చెన్ యూఫే, స్పెయిన్‌ షట్లర్ కరోలినా మారిన్ మధ్య జరిగే మరో సెమీఫైనల్‌లో గెలిచిన విజేతతో సైనా ఫైనల్స్‌లో తలపడనుంది. ఫైనల్స్ లో కూడా సైనా తన జోరు కొనసాగించి విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios