Asianet News TeluguAsianet News Telugu

డెన్మార్ ఓపెన్‌లో ముగిసిన పీవీ సింధు పోరాటం... క్వార్టర్ ఫైనల్స్ నుంచే ఇంటిదారి...

Denmark Open 2021: కొరియాకి చెందిన 8వ సీడ్ యన్ సియాంగ్‌తో జరిగిన వుమెన్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌ మ్యాచ్‌లో 11-21, 12-21 తేడాతో పోరాడి ఓడిన పీవీ సింధు...

Indian Star badminton player Pv Sindhu losses in Denmark open quarter finals
Author
India, First Published Oct 22, 2021, 8:07 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, డెన్మార్క్ ఓపెన్ నుంచి నిష్కమించింది. డెన్మార్ట్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీలో కొరియాకి చెందిన 8వ సీడ్ యన్ సియాంగ్‌తో జరిగిన వుమెన్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌ మ్యాచ్‌లో 11-21, 12-21 తేడాతో పోరాడి ఓడింది పీవీ సింధు...

67 పాటు సుదీర్ఘంగా సాగిన ప్రీ క్వార్టర్స్ మ్యాచ్ తర్వాత అలిసిపోయినట్టు కనిపించిన పీవీ సింధు, ఈ మ్యాచ్‌లో కేవలం 36 నిమిషాల్లోనే చేతులెత్తేసింది. ఇంతకుముందు రెండేళ్ల క్రితం సియాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ రెండు వరుస సెట్లలో ఓడిన పీవీ సింధు, మరోసారి అదే ఫలితాన్ని రిపీట్ చేసింది...

తొలి సెట్‌లో 7-8 తేడాతో కొరియా షెట్లర్‌పై ఆధిక్యం సాధించిన పీవీ సింధు, ఆ తర్వాత వరుస పాయింట్లు కోల్పోయి మొదటి సెట్‌ను సమర్పించింది. ఆ తర్వాత రెండో సెట్‌లో దూకుడు పెంచిన సియాంగ్, సింధుపై సునాయాస విజయాన్ని నమోదుచేసింది...

టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గి, రెండు ఒలింపిక్ పతకాలు సాధించిన మొట్టమొదటి మహిళా అథ్లెట్‌గా రికార్డు క్రియేట్ చేసిన పీవీ సింధు, కొంత కాలం బ్రేక్ తీసుకుని తిరిగి డెన్మార్మ్ ఓపెన్‌ ద్వారానే బరిలో దిగింది.

 

ఇవీ చదవండి: వెల్‌కం బ్యాక్ ధోనీ... మాహీ రిటైర్మెంట్ తర్వాత మ్యాచులు చూడడం మానేసిన పాకిస్తానీ బషీర్ చాచా...

T20 worldcup 2021: ధోనీని మెంటర్‌గా తీసుకొచ్చింది అతనే... కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని...

 ఒకే ఓవర్‌లో 8 సిక్సర్లు... చితక్కొట్టుడు అంతే ఇదేనేమో... ఆస్ట్రేలియా బ్యాటర్ రికార్డు...

T20 worldcup 2021: మ్యాచ్ అవసరమా, మాకు వాకోవర్ ఇచ్చేయండి... షోయబ్ అక్తర్‌కి హర్భజన్ సింగ్ చురక...

T20 worldcup 2021: అతన్ని తీసుకోవడానికి ధోనీయే కారణం... కోహ్లీ, శాస్త్రిలను ఒప్పించి మరీ...

 T20 worldcup 2021: సన్‌రైజర్స్ జట్టు, వార్నర్‌ను అవమానించింది... ఐపీఎల్ వల్లే అతనిలా ఆడుతున్నాడు...

 T20 worldcup 2021: నాలుగేళ్లు, రూ.36 వేల కోట్లు... ఐపీఎల్ ప్రసార హక్కుల ద్వారా బీసీసీఐకి కాసుల పంట...

 T20 worldcup 2021: బౌలింగ్‌లో అతన్ని మించిన తోపు లేడు... ఇర్ఫాన్ పఠాన్ కామెంట్..

Follow Us:
Download App:
  • android
  • ios