శ్రీలంక రాజధాని కొలంబోతో పాటు సమీప ప్రాంతాల్లో ఆదివారం సంభవించిన బాంబు పేలుళ్లను ప్రపంచ దేశాలు ఖండించాయి. తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు పలువురు క్రీడా ప్రముఖులు బాంబు పేలుళ్లను ఖండించారు.

‘‘ఉదయం శ్రీలంకలో బాంబు పేలుళ్లు జరిగాయన్న వార్త తెలియగానే షాక్‌కు గురయ్యానని.. ఈ దుర్ఘటనలో మరణించిన వారికి కోహ్లీ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ట్వీట్ చేశారు.

శ్రీలంకలోని పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు జరిగాయన్న వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని.. ఈ ఘటనను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. ద్వేషం మరియు హింస ఎప్పుడు ప్రేమ, దయ మరియు కరుణపై ఆధిక్యతను చెలాయించలేదన్నాడు.

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పేలుళ్ల పట్ల విచారం వ్యక్తం చేశారు. ప్రపంచంలో అసలు ఏం జరుగుతోందంటూ దిగ్భ్రాంతికి లోనయ్యారు. భగవంతుడు వారికి తోడుగా ఉండాలని ఆమె ప్రార్ధించారు.