Asianet News TeluguAsianet News Telugu

భారత లెజెండరీ స్ప్రింటర్ మిల్కా సింగ్ భార్య నిర్మల కన్నుమూత... వాలీబాల్ జట్టు కెప్టెన్‌గా...

82 ఏళ్ల వయసులో కరోనాతో పోరాడుతూ ప్రాణాలు విడిచిన నిర్మలా మిల్కా సింగ్...

భారత వాలీబాల్ మహిళా జట్టుకి కెప్టెన్‌గా కూడా వ్యవహరించిన నిర్మలా...

Indian legendary splinter Milkha Singh Wife Nirmala died with Covid-19 CRA
Author
India, First Published Jun 14, 2021, 4:42 PM IST

భారత మాజీ స్ప్రింటర్, లెజెండ్ మిల్కా సింగ్ భార్య నిర్మల... అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. భారత వాలీబాల్ మహిళా జట్టుకి కెప్టెన్‌గా కూడా వ్యవహరించిన నిర్మలా, కొన్నాళ్ల కిందట కరోనా బారిన పడ్డారు. చంఢీఘర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె, తీవ్ర అనారోగ్యంతో ఆదివారం కన్నుమూశారు.

మిల్కా సింగ్ కరోనాతో ప్రాణాలు విడిచినట్టు వార్తలు వచ్చినా, వాటిని వట్టి పుకార్లేనని కొట్టిపారేశారు వైద్యులు. ప్రస్తుతం 91 ఏళ్ల మిల్కా సింగ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, కోలుకుంటున్నారని ఆసుపత్రి వైద్యులు తెలియచేశారు.

పంజాబ్‌లో జన్మించిన నిర్మలా సైనీ, పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్స్ చేశారు. పంజాబ్ రాష్ట్ర మహిళా క్రీడల డైరెక్టర్‌గా వ్యవహారించిన నిర్మల కొడుకు జీవ్ మిల్కా సింగ్, ప్రస్తుతం భారత ప్రొఫెషనల్ గోల్ఫర్‌గా కొనసాగుతున్నాడు.

Follow Us:
Download App:
  • android
  • ios