Asianet News TeluguAsianet News Telugu

ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రాకి అభినవ్‌ బింద్రా క్యూట్ గిఫ్ట్... అప్పుడు మరోటి ఇస్తానంటూ...

నీరజ్ చోప్రాకి ‘టోక్యో’ అని పేరున్న కుక్కపిల్లను కానుకగా ఇచ్చిన అభినవ్ బింద్రా... 2024లో ‘పారిస్’ అనే కుక్క పిల్లను గెలవడానికి ఇది సాయం చేస్తుందంటూ ట్వీట్...

Indian Golden man Neeraj Chopra receives a cub named Tokyo from first Indian gold medalist Abhinav Bindra
Author
India, First Published Sep 22, 2021, 6:12 PM IST

టోక్యో ఒలింపిక్స్ జరిగినన్ని రోజులు సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్‌గా ఉంటూ, మెడల్స్ సాధించిన అథ్లెట్లను అభినందించాడు బీజింగ్ ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ అభినవ్ బింద్రా. 2008 బిజీంగ్ ఒలింపిక్స్‌లో 10మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో స్వర్ణం సాధించి, వ్యక్తిగత విభాగంలో స్వర్ణం గెలిచిన మొట్టమొదటి భారతీయుడిగా రికార్డు క్రియేట్ చేశాడు అభినవ్ బింద్రా... 

2020 టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్ సాధించి, ఫీల్డ్ అథ్లెటిక్స్‌లో స్వర్ణం సాధించిన మొట్టమొదటి భారత అథ్లెట్‌గా నిలిచిన నీరజ్ చోప్రాను ఆత్మీయంగా కలిసి, ఓ బహుమతి అందచేశాడు అభినవ్ బింద్రా...

ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్‌ల క్లబ్‌లోకి నీరజ్ చోప్రాను సగర్వంగా ఆహ్వానిస్తున్నట్టు ట్వీట్ చేసిన అభినవ్ బింద్రా... నీరజ్ చోప్రాకి ‘టోక్యో’ అనే పేరున్న ఓ కుక్క పిల్లను కానుకగా ఇచ్చాడు... ‘ఇండియా గోల్డెన్ మ్యాన్ నీరజ్ చోప్రాను కలవడం చాలా సంతోషాన్నిచ్చింది. ఈ ‘టోక్యో’(కుక్కపిల్ల) నీకు చాలా సపోర్టివ్ ఫ్రెండ్‌గా ఉండి, 2024లో తన తమ్ముడు ‘పారిస్’ను పొందేందుకు నిన్ను ప్రేరేపిస్తుందని అనుకుంటున్నా...’ అంటూ ట్వీట్ చేశాడు అభినవ్ బింద్రా...

జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా, టోక్యో ఒలింపిక్స్‌ తర్వాత భారత్‌లో ఒక్కసారిగా స్టార్‌గా మారిపోయాడు... ఒలింపిక్స్ ముగిసిన తర్వాత నీరజ్ చోప్రా బ్రాండ్ వాల్యూ వేల రెట్లు పెరిగింది...

టోక్యో నుంచి వచ్చిన తర్వాత వరుస ఇంటర్వ్యూలు, సభలు, సమావేశాలకు హాజరైన నీరజ్ చోప్రా... అనారోగ్యానికి గురయ్యారు. పూర్తిగా కోలుకున్న తర్వాత తన తల్లిదండ్రులను విమానం ఎక్కించిన నీరజ్ చోప్రా... ప్రస్తుతం కొన్ని వ్యాపార ప్రకటనల్లోనూ నటిస్తూ బిజీబిజీగా గడిపేస్తున్నాడు...
 

Follow Us:
Download App:
  • android
  • ios