సోషల్ మీడియాలో యాక్టివ్ గా వుండే క్రికెటర్లలో  టీమిండియా ప్లేయర్ హర్భజన్ సింగ్ ఒకరు. ఆయన కేవలం క్రికెట్ కు సబంధించిన విషయాలు, విశేషాలపైనే కాకుండా తన మనసుకు నచ్చిన విషయాలనూ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ద్వారా అభిమానులతో పంచుకుంటారు. తాజాగా తన ప్రతిభతో ఓ బుడతడు భజ్జీ మనసును దోచుకున్నాడు. దీంతో అతడికి సంబంధించిన  వీడియోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి ప్రశంసలు కురిపించారు. 

భారతదేశంలో అంతగా ఆదరణ లేని పుట్ బాల్ మెళకువలను అతి చిన్న వయస్సులోని బుడతడికి ఒంటబట్టినట్లున్నాయి. బాలుడు పుట్ బాల్ తో ఓ ఆటాడుకుంటున్న వీడియో ఎలాగో భజ్జీ దగ్గరకు వెళ్లింది. ఇంకేముంది అతడు ఆ బాలుడు ప్రతిభకు ముగ్దుడై అతడిపై ప్రశంసలు కురిపిస్తూ ఇన్స్టాగ్రామ్ లో ఆ వీడియోను పోస్ట్ చేశారు. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Unbelievable skill at his age.. another great in years to come 🤔?? What say guys

A post shared by Harbhajan Turbanator Singh (@harbhajan3) on Jul 10, 2020 at 10:39pm PDT

''ఈ వయస్సులో నమ్మశక్యం కాని నైపుణ్యం... రాబోయే సంవత్సరాల్లో మరో గొప్ప ప్రతిభ మనముందుకి రానుంది. ఏమంటారు'' అంటూ పుట్ బాల్ బుడతడికి సంబంధించిన వీడియోను  పోస్ట్ చేశాడు హర్భజన్.