నేటి నుంచి టోక్యో పారాలింపిక్స్ 2020... టీమిండియా చరిత్రలోనే రికార్డు స్థాయిలో...
24 ఆగస్టు నుంచి సెప్టెంబర్ 5 వరకూ సాగనున్న పారాలింపిక్స్... తొలిసారిగా పారాలింపిక్స్‌లో భారత్ నుంచి రికార్డు స్థాయిలో 54 మంది పారా అథ్లెట్లు...
ఒలింపిక్స్ 2020 విజయాలు ఇచ్చిన ఉత్సాహంతో భారత పారా అథ్లెట్లు, పారాలింపిక్ గేమ్స్‌కి టోక్యోకి బయలుదేరి వెళ్లారు. 24 ఆగస్టు నుంచి ప్రారంభమయ్యే పారాలింపిక్స్, సెప్టెంబర్ 5 వరకూ జరుగుతాయి. ఈ సారి ఏకంగా 54 మంది పారా అథ్లెట్లను టోక్యోకి పంపనుంది భారత్.
టీమిండియాకి పారాలింపిక్స్ చరిత్రలో ఇదే అత్యధికం... వీరిలో షూటర్లు, ఆర్చర్లు, స్మిమ్మర్లు, జావెలిన్ త్రో అథ్లెట్లు, బ్యాడ్మింటన్ ప్లేయర్ల బృందం ఇప్పటికే టోక్యోకి చేరుకుంది...
పారాలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్‌లో మనోజ్ సర్కార్, సుహాస్ ఎల్ యతిరాజ్, తరుణ్ దిల్లాన్, కృష్ణ నగర్, ప్రమోద్ భగత్, మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో పరుల్ పర్మార్, పలక్ కోహ్లీ, హై జంప్ ఈవెంట్‌లో వరుణ్ సింగ్ బటి, రామ్ పాల్ చహార్, పారా స్విమ్మింగ్‌లో నిరంజన్ ముకుందన్, సుయాష్ నారాయణ్ జాదవ్ పాల్గొంటున్నారు.
పారా కనోయింగ్‌లో ప్రాచీ యాదవ్, జావెలిన్ త్రోలో దేవేంద్ర, సుందర్ సింగ్ గుర్జర్, అజిత్ సింగ్, సందీప్ చౌదరి, సుమిత్ అంటిల్, నవ్‌దీప్, పారా టేబుల్ టెన్నిస్‌లో సోనల్ పటేల్, భవీనా పటేల్, షాట్ పుల్‌లో అర్వింద్, తైక్వాండోలో అరుణా తన్వార్, తదితరులు భారత్ తరుపున పాల్గొనబోతున్నారు. ఈసారి బ్యాడ్మింటన్, తైక్వాండో పోటీలను పారాలింపిక్స్‌లో తొలిసారి ప్రవేశపెట్టబోతున్నాడు.
పారాలింపిక్స్‌లో పాల్గొంటున్న భారత అథ్లెట్లకు భారత ప్రధాని నరేంద్రమోదీతో పాటు క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, క్రికెటర్లు కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, యువరాజ్ సింగ్, భారత రెజ్లర్ రితూ ఫోటర్, యోగేశ్వర్ దత్, బ్యాడ్మింటన్ ప్లేయర్ సాత్విక్ సాయిరాజ్, ఒలింపిక్ విన్నర్ కరణం మల్లీశ్వరి, బీసీసీఐ సెక్రటరీ జై షా తదితరులు శుభాకాంక్షలు తెలియచేశారు.