మరికొద్దిసేపట్లో దక్షిణాఫ్రికాతో టీం ఇండియా తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. విశాఖపట్నం వేధికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టీం ఇండియా కెప్టెన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే టీ20 సిరీస్ సమం కాగా... తొలి టెస్టు లో విజయం సాధించి... ఈ సిరీస్ లో ఆధిక్యం సాధించాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. ఇక టెస్టుల్లో రోహిత్ శర్మ ఓపెనింగ్ బ్యాట్స్ మన్ గా బరిలోకి దిగుతుండటంతో అతడిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ మ్యాచ్ లో తలపడే జట్టు సభ్యులు వీరే..

టీం ఇండియా... విరాట్ కోహ్లీ, ఆజింక్యా రహానె, మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మ, ఛెతేశ్వర్ పుజారా, హనుమ విహారి, వృద్ధిమాన్ సాహా, జడేజా, అశ్విన్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమి.

టీం దక్షిణాఫ్రికా... మార్ క్రమ్, ఎల్గర్, డి బ్రున్, బువుమా, డుప్లెసిస్, డికాక్, ఫిలాండర్, ముతుసామి, కేశవ్ మహారాజ్, డేన్ పైత్, రబాడ