విశాఖ వేధికగా టీం ఇండియా.. దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్ మ్యాచ్ కి రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. తొలుత టాస్ గెలిచి కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కాగా... ఓపెనర్లుగా రోహిత్ శర్మ, మయాంక్ లు బ్యాటింగ్ అదరగొట్టారు. సుదీర్ఘ ఫార్మాట్లో తొలిసారి ఓపెనింగ్ చేస్తున్న రోహిత్ శర్మ అర్థశతకంతో దూసుకుపోతున్నాడు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కూడా స్పిన్నర్లపై దూకుడుగా ఆడుతున్నాడు. ఈ మ్యాచ్ లో రోహిత్, మయాంక్ జోడి పలు రికార్డులను కూడా సొంతం చేసుకున్నారు.

తొలి ఇన్నింగ్స్ లో 100+ ఓపెనింగ్ భాగస్వామ్యం అందించిన ఏడో జోడీగా మయాంక్, రోహిత్ నిలిచారు. అంతకముందు  ఏ మన్కడ్-ఫరూక్ ఇంజినీర్ ఆసీస్ పై 1969-70లో 111 పరగులు చేశారు. సునీల్ గవాస్కర్- అరుణ్ లాల్ జోడి శ్రీలంకపై 1982లో 156 పరుగులు చేశారు.

వీరేంద్ర సెహ్వాగ్- రాహుల్ ద్రవిడ్ జోడి పాక్ పై 2005-2006లో 410 పరుగులు సాధించారు. మురళీ విజయ్- శిఖర్ ధావన్ జోడి ఆస్ట్రేలియాపై 2012-2013లో 289 పరుగులు చేశారు. కేఎల్ రాహుల్- పార్థివ్ పటేల్ జోడి ఇంగ్లాండ్ పై 2016-2017లో 152 పరుగులు చేశారు. మయాంక్ అగర్వాల్- రోహిత్ శర్మ జోడి ప్రస్తుతం 100కు పైగా పరుగులు సాధించారు. వారి ఆట ఇంకా కొనసాగుతోంది.