Asianet News TeluguAsianet News Telugu

ప్రతీ తరంలోనూ ఆటగాళ్లు అద్బుతంగా రాణిస్తున్నారు - కపిల్ దేవ్

ప్రతీ తరంలో మెరుగైన ఆటగాళ్లు వస్తూనే ఉంటారని టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నారు.11 మంది టీమ్ లో ఎవరి గురించి ప్రత్యేకంగా చెప్పలేమని తెలిపారు. 

In every generation the players are excelling - Kapil Dev
Author
First Published Jan 23, 2023, 3:01 PM IST

ప్రతీ తరంలోనూ అద్భుతమైన ఆటగాళ్లు తమ ప్రతిభతో రాణిస్తున్నారని టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నారు. 11 మంది ఆటగాళ్లతో జట్టు ఉంటుందని, అందుకే ఏ ఒక్క ఆటగాడి గురించి ప్రత్యేకంగా చెప్పలేమని తెలిపారు. తన కాలంలో సునీల్ గవాస్కర్ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ అని, కానీ తరం అభివృద్ధి చెందుతున్న కొద్దీ మెరుగైన ఆటగాళ్ళు వస్తూనే ఉన్నారని అన్నారు.  ప్రతి తరంలో వివిధ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తారని చెప్పారు.

కర్ణాటక హిజాబ్ నిషేధం కేసు విచార‌ణ‌కు ముగ్గురు న్యాయ‌మూర్తుల‌తో సుప్రీంకోర్టు బెంచ్

మాజీ టీమిండియా కెప్టెన్ కపిల్ దేవ్ గల్ఫ్ న్యూస్‌తో సంభాషించారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లిలలో ఎవరు గొప్ప ఆటగాళ్లు అనే ప్రశ్న వచ్చినప్పుడు ‘‘మీరు ఒకరు లేదా ఇద్దరు ఆటగాళ్లను ఎంపిక చేయలేరు. ఇది 11 మంది ఆటగాళ్లతో కూడిన జట్టు. నాకు నా సొంత ఇష్టాలు, అయిష్టాలు ఉండవచ్చు. కానీ ప్రతీ తరంలో మెరుగైన ఆటగాళ్ళు వస్తూనే ఉంటారు. మా కాలంలో సునీల్ గవాస్కర్ అత్యుత్తమ ఆటగాడు. ఆ తర్వాత రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, ఈ తరంలో రోహిత్, విరాట్‌లను చూశాం. ముందు తరం ఇంకా బాగుంటుంది.’’ అని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios