వరల్డ్ కప్ ప్రారంభం కావడానికి మరెంతో దూరంలో లేదు. క్రికెట్ ప్రియులంతా ఎంతో ఆసక్తి ఎదురుచూస్తున్న ప్రపంచ కప్ ఇంగ్లాండ్ వేదికగా ఈ నెల 30న ప్రారంభం కానుంది. ఇప్పటికే కప్ ఎవరు గెలుస్తారు అనే విషయంపై చర్చలు జరుగుతున్నాయి. పలువురు మాజీ క్రికెటర్లు తమ ఫేవరెట్ టీంలను ప్రకటించేశాయి కూడా.

తాజాగా టీం ఇండియా మాజీ కెప్టెన్, మాజీ కోచ్ అనిల్ కుంబ్లే.. ఈ విషయంపై స్పందించారు.ఆస్ట్రేలియాకు ప్రపంచకప్ గెలిచే సత్తా ఉందని అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకూ జరిగిన అన్ని ఐసీసీ ఈవెంట్‌లలోనూ ఆస్ట్రేలియాకు అద్భుతంగా రాణించిందని ఆయన పేర్కొన్నారు.
 
‘‘వాళ్లు ప్రతీ ప్రపంచకప్‌లోనూ అద్భుతమైన ప్రదర్శన చేశారు. ఈసారి వాళ్ల జట్టు చాలా పటిష్టంగా ఉంది. ఇంగ్లండ్ పరిస్థితులు కూడా వాళ్లకి బాగా తెలుసు. కాబట్టి వాళ్లు విజయవంతంగా టోర్నమెంట్‌ను ముగిస్తారని అనుకుంటున్నారు. ఆస్ట్రేలియాకు విజయం ఎలా సాధించాలో తెలుసు. ప్రపంచకప్‌లో అది చాలా ముఖ్యం. వాళ్లు కచ్చితంగా సెమీఫైనల్స్‌కు చేరుతారు’’ అని కుంబ్లే అన్నారు.