Asianet News TeluguAsianet News Telugu

భారత హాకీ జట్టు సంచలన నిర్ణయం... కామన్వెల్త్ గేమ్స్ 2022 నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటన...

క్వారంటైన్, కఠినమైన బయో బబుల్ ప్రోటోకాల్‌ కారణంగానే కామన్వెల్త్ గేమ్స్ 2022 నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన హాకీ ఇండియా...

Hockey India have withdrawn their participation from the Commonwealth Games 2022
Author
India, First Published Oct 5, 2021, 7:57 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన భారత హాకీ జట్టు, సంచలన నిర్ణయం తీసుకుంది. 2022లో ఇంగ్లాండ్‌లో జరిగే కామన్వెల్త్ గేమ్స్ నుంచి తప్పుకుంటున్నట్టు కీలక ప్రకటన చేసింది భారత హాకీ ఫెడరేషన్. కరోనా నియమాలు, అత్యంత కఠినమైన క్వారంటైన్ ప్రోటోకాల్‌ కారణంగానే కామన్వెల్త్ గేమ్స్ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకుంది హాకీ ఇండియా...

వచ్చే ఏడాది జూలై 28 నుంచి ఆగస్టు 8 వరకూ కామన్వెల్త్ గేమ్స్ జరగనున్నాయి. ఆ తర్వాత 32 రోజులకు 2022, సెప్టెంబర్ 10న చైనాలో ఆసియా క్రీడలు ప్రారంభం కానున్నాయి... ఆసియా క్రీడల్లో పతకం సాధిస్తే, నేరుగా 2024 పారిస్ ఒలింపిక్స్‌కి అర్హత సాధిస్తాయి భారత హాకీ జట్లు...

‘కరోనా కష్ట కాలంలో ఇంగ్లాండ్‌లో 10 రోజుల పాటు క్వారంటైన్‌ పీరియడ్ పూర్తిచేసుకోవాలని సూచించారు. వ్యాక్సిన్ కోర్సు పూర్తిచేసుకున్నవారికి కూడా క్వారంటైన్ తప్పనిసరి అన్నారు. అదీకాకుండా భారత్‌లో ఇచ్చే కరోనా వ్యాక్సిన్‌లకు ఇంగ్లాండ్ ప్రభుత్వ గుర్తింపు లేదు.

ఇదీ చదవండి: డేవిడ్ వార్నర్‌ను తొలగించడానికి కారణం ఇదే, పర్పామెన్స్ కాదు... - సంజయ్ మంజ్రేకర్...

టోక్యోలో జరిగిన ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లకి ఇలాంటి కఠిన నియమాలు లేవు. ఈ నిబంధనలు కావాలని భారత్‌కి వ్యతిరేకంగా పెట్టినట్టు మాకు అనిపిస్తోంది...’ అంటూ కామెంట్ చేశాడు హాకీ ఇండియా ప్రెసిడెంట్ జ్ఞానేంద్రో నింగోబం..

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత హాకీ పురుషుల జట్టుకి 2 రజత పతకాలు సాధించిన రికార్డు ఉంది. 2010లో, 2014లో రెండో స్థానంలో నిలిచింది హాకీ ఇండియా. భారత మహిళా హాకీ జట్టు మాత్రం 2002 మాంచెస్టర్ కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం, 2006 మెల్‌బోర్న్ కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం సాధించారు... 

Follow Us:
Download App:
  • android
  • ios