జూనియ‌ర్ అథ్లెటిక్ చాంపియ‌న్ షిప్‌లో  భారత్ స్వర్ణం గెలుచుకుంది. హిమ్ దాస్.. దేశానికి స్వర్ణాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్‌లో భార‌త్‌కు ల‌భించిన తొలి బంగారు ప‌త‌కం ఇదే కావ‌డం విశేషం. దీంతో ఈ అరుదైన ఘ‌న‌త‌ను సాధించిన హిమ దాస్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది.

 

ఆమెపై ప్రసంశల వర్షం కురిపించిన వారిలో టాలీవుడ్ హీరో మహేష్ బాబు కూడా చేరిపోయారు. ఆమెకు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘హిమ దాస్ అద్భుత ప్ర‌తిభ క‌న‌బ‌రిచింది. భార‌త క్రీడారంగంలోనే అత్యంత అరుదైన విజ‌యాల్లో ఇదొక‌టి. చాలా గ‌ర్వంగా ఉంది. సంతోషంగా ఉంది. కంగ్రాట్స్ హిమ‌దాస్‌’ అంటూ మ‌హేష్ ట్వీట్ చేశారు.