Asianet News TeluguAsianet News Telugu

ఆ బాధలన్నింటినీ భరించా..యూవీ భార్య హాజిల్

 పదేళ్ల క్రితం ఎలా ఉన్నాం, గతంతో పోలిస్తే ఇప్పుడు మనలో వచ్చిన మార్పులేంటి తదితర అంశాలను ఫొటోలతో సహా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయాలి. 

Hazel Keech Reveals Struggle With Depression, Bulimia Via Viral #10YearChallenge
Author
Hyderabad, First Published Jan 17, 2019, 9:18 AM IST

పదేళ్ల క్రితం తాను ఎన్నో బాధలు అనుభవించానని బాలీవుడ్ సినీ నటి, క్రికెటర్ యువరాజ్ సింగ్ భార్య హాజిల్ కిచ్ చెప్పారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో  #10ఇయర్స్‌చాలెంజ్‌ పేరిట కొత్త సవాల్ సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. పదేళ్ల క్రితం ఎలా ఉన్నాం, గతంతో పోలిస్తే ఇప్పుడు మనలో వచ్చిన మార్పులేంటి తదితర అంశాలను ఫొటోలతో సహా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయాలి. 

ఇప్పటికే బాలీవుడ్‌ తారలు సోనమ్‌ కపూర్‌, బిపాసా బసు, శృతి హాసన్‌లు ఇప్పటికే ఈ చాలెంజ్‌ను స్వీకరించారు. నటి, క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ భార్య హాజిల్‌ కీచ్‌ కూడా ఈ జాబితాలో చేరారు. హాజిల్ తన ఫోటోతోపాటు.. ఆమె పెట్టిన పోస్టు చాలా భావోద్వేగంతో నిండి ఉంది.

‘22 నుంచి 32 ఏళ్లు.. ఇంత దూరం ప్రయాణించానా! అప్పుడు డిప్రెషన్‌ను జయించేందుకు యుద్ధం చేసేదాన్ని, ఉపవాసం ఉండేదాన్ని,  జట్టుకు చిక్కగా రంగేసుకునేదాన్ని. నా చుట్టూ ఉన్నవాళ్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇలాంటి పనులన్నీ చేసేదాన్ని. వారిని సంతోషంగా ఉంచేందుకు బాధలన్నీ పంటిబిగువనే భరించాను. కానీ ఈరోజు పూర్తి విశ్వాసంతో మాట్లాడగలను. ఎవరు ఏమనుకుంటారోనన్న భయం లేదు. ఇప్పుడు ధైర్యంగా జట్టు కత్తిరించుకుంటున్నా. నా సంతోషం కోసమే నేను బతుకుతున్నా. ఇం‍త ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉంటానని ఎప్పుడూ కనీసం ఊహించలేదు. 10ఇయర్స్‌చాలెంజ్‌ మొదలుపెట్టిన వారికి కృతఙ్ఞతలు’ అంటూ హాజిల్‌ కీచ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ పోస్ట్‌ చేశారు. 

కాగా,.. ఆమె పోస్టుకి నెటిజన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. మీలాంటివారు మాకు ఆదర్శం అంటూ.. నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Here is my #10yearchallenge 22 years on the right VS almost 32 years on the left.... and how far I’ve come! I was battling depression, starving myself, had bulimia, dyed my hair dark and kept it long trying to fit in a please everyone around me but hiding all the pain with a smile and joke so no one knew. Today, i can confidently talk about what I’ve gone through, i dont care what others think of me, i finally had the courage to cut my hair, i dont try and fit in anymore and i am happier, healthier and more at peace with myself than i ever imagined i could be! Wahooo #personalcelebration thanks whoever started the 10 year challenge ❤️

A post shared by Hazel Keech Singh (@hazelkeechofficial) on Jan 16, 2019 at 2:39am PST

 

Follow Us:
Download App:
  • android
  • ios