ఆటనే ఆడాలా.. మిమ్మిల్ని నమ్మించాలా..? నా సర్టిఫికేట్స్ ఒరిజనలే: హర్మన్ ప్రీత్

harman preet kaur reaction against fake certificate
Highlights

ప్రభుత్వానికి నకిలీ డిగ్రీ సర్టిఫికేట్స్ ఇచ్చి మోసం చేశారనే ఆరోపణలపై భారత మహిళా టీ20 కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌ డీఎస్పీ హోదా నుంచి పంజాబ్ ప్రభుత్వం తొలగించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా పెద్ద దుమారాన్ని రేపింది. ఈ వివాదంపై హర్మన్ ప్రీత్ తొలిసారిగా స్పందించారు.. 

ప్రభుత్వానికి నకిలీ డిగ్రీ సర్టిఫికేట్స్ ఇచ్చి మోసం చేశారనే ఆరోపణలపై భారత మహిళా టీ20 కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌ డీఎస్పీ హోదా నుంచి పంజాబ్ ప్రభుత్వం తొలగించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా పెద్ద దుమారాన్ని రేపింది. ఈ వివాదంపై హర్మన్ ప్రీత్ తొలిసారిగా స్పందించారు.. అవి నకిలీ సర్టిఫికేట్స్ కాదని తాను పరీక్షల్లో పాసై సంపాదించినవేనని స్పష్టం చేశారు..

కేవలం డిగ్రీ పూర్తి చేయాలనే చదివాను.. అన్ని సబ్జెక్ట్‌ల్లో పాస్ అయ్యాను.. ఢిల్లీలో పీరీక్షలు రాశా.. సోషియాలజీ, పొలిటికల్ సైన్స్, ఇంగ్లీష్, జనరల్ అవేర్‌నెస్ తన సబ్జెక్టులని ఆమె తెలిపారు. అందరిలా తాను హెడ్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ.. నా ఎన్‌రోల్‌మెంట్ నంబర్‌తో సర్టిఫికేట్లను రుజువుచేయలేనని.. ఎందుకంటే తాను క్రికెటర్‌నని.. నా దృష్టంతా ఎప్పుడూ ఆటపైనే ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.

గతేడాది జరిగిన మహిళ వన్డే ప్రపంచకప్‌ సెమీఫైనల్లో సెంచరీతో చేలరేగిన హర్మన్ ప్రీత్ భారత్‌ను ఫైనల్స్‌కు చేర్చారు.. ఈ ప్రదర్శనను ప్రశంసించిన పంజాబ్ ప్రభుత్వం ఆమెకు డీఎస్పీ ఉద్యోగం ఇచ్చారు. ఈ ఏడాది మార్చిలో ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ చేతుల మీదుగా ఆమె బాధ్యతలు స్వీకరించారు.

ఈ సమయంలో తన విద్యార్హతల ధ్రువీకరణ కింద డిగ్రీ సర్టిఫికేట్స్ సమర్పించారు హర్మన్. ఇవి నకిలీ సర్టిఫికేట్స్ అని ఆరోపణలు రావడంతో పోలీస్ శాఖ విచారణ జరిపింది. వారి దర్యాప్తులో అవి నకిలీవేనని తేలడంతో ఆమెను డీఎస్పీ ఉద్యోగం నుంచి తప్పించారు. ఆమె భవిష్యత్తు దృష్ట్యా పంజాబ్ ప్రభుత్వం హర్మన్‌పై చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

loader