ఇండియన్ క్రికెటర్లలో ప్రతిభ గల ఆటగాళ్లలో శ్రేయాస్ అయ్యర్ ఒకరు. ఈ యువ క్రికెటర్ కి ప్రపంచకప్ లో చోటు దక్కకపోయినా... వెస్టిండీస్ పర్యటనలో మాత్రం చోటు దక్కింది. ఈ విషయంలో ఆనందం  వ్యక్తం చేసిన శ్రేయాస్... జట్టులో సుస్థిర స్థానం లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశాడు. ప్రతిభావంతుడైన ఆటగాడు సత్తా చాటుకోవాలంటే, పరిస్థితులకు అలవాటు పడాలంటే అతనికి తగినన్ని అవకాశాలు ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు. ఓ మ్యాచ్ కోసం జట్టులోకి వచ్చి...మరో మ్యాచ్ కోసం జట్టులో నుంచి వెళ్లిపోవడం ఆటగాడికి అంత మంచింది కాదని అన్నాడు. అతి ఆటగాడిలోని ఆత్మవిశాస్వం దెబ్బతీస్తుందని అభిప్రాయపడ్డాడు.

‘‘ జట్టుకి ఎంపిక కావడం మన చేతుల్లో ఉండదు. మెరుగైన ప్రదర్శన ఇవ్వడం మాత్రమే ఒక ఆటగాడి చేతుల్లో ఉంటుంది. అలా చేయడాన్ని నేను ఆస్వాదిస్తాను’’ అని శ్రేయాస్ అయ్యర్ అన్నాడు. సెలక్టర్లు పదే పదే కొందరు క్రికెటర్లను జట్టు ఎంపిక చేయకపోవడం విషయంపై మీడియా వేసిన ప్రశ్నకు  శ్రేయాస్ ఈ విధంగా స్పందించాడు.

భవిష్యత్తులో ప్రపంచకప్ ఆడతాననే నమ్మకం ఉందా అన్న ప్రశ్నకు కూడా శ్రేయాస్ స్పందించాడు. తాను కచ్చితంగా ప్రపంచకప్ లో ఆడతానిని ఆశాభావం వ్యక్తం చేశాడు. మొన్న జరిగిన ప్రపంచకప్ లో ఎంపిక కాకపోవడం చాలా బాధకలిగించిందని చెప్పాడు. దేశం తరపున ప్రపంచకప్ ఆడటం తన కల అని చెప్పాడు.